Blog Layout

మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వాయిదా..! కారణం ఇదే..

మెగా డీఎస్సీలో అత్యుత్తమ ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు కాల్‌ లెటర్లను విద్యాశాఖ అధికారులు మంజూరు చేయనున్నారు. రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్‌ మార్కులను నిర్ణయించిన అధికారులు.. ర్యాంకులు కూడా కేటాయించారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 1:1 విధానంలో కాల్‌లెటర్లు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మెగా డీఎస్సీ మెరిట్‌ జాబితా ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యుత్తమ ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు కాల్‌ లెటర్లను విద్యాశాఖ అధికారులు మంజూరు చేయనున్నారురు. రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్‌ మార్కులను నిర్ణయించిన అధికారులు.. ర్యాంకులు కూడా కేటాయించారు. పోస్టులకు ఎంపికైన …

Read More »

మా పెళ్లికి తప్పకుండా రండి అంటూ వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.. ఓపెన్‌ చేసి చూడగా..

రోజురోజుకూ సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో జనాలను నిండా ముంచి.. అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెలుగు చూసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ రాగా.. ఎవరిదా అని ఒపెన్‌ చేశాడు. అంతే అతని అకౌంట్లోంచి రూ.2లక్షలు కొట్టేశారు కేటుగాళ్లు.వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ను ఓపెన్‌ చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగి రూ.2లక్షలు పొగొట్టుకున్న ఘటన మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. హింగోలీకి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగికి …

Read More »

సాధారణ జ్వరం కాదు.. ప్రాణాంతక డెంగ్యూ.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!

నిర్మలంగా ఉన్న ఆకాశం, చల్లటి గాలులతో వర్షాకాలం ఆహ్లాదకరంగా అనిపించవచ్చు. కానీ, ఈ కాలంలోనే డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సాధారణ జ్వరంలా మొదలై, ఆ తర్వాత ప్రాణాల మీదకు తెచ్చే ఈ డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. తేలికపాటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, వాటిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం డెంగ్యూను ఎదుర్కోవడంలో కీలకం. సాధారణ జ్వరానికి, డెంగ్యూ జ్వరానికి మధ్య ఉన్న తేడాలు, లక్షణాలను తెలుసుకుందాం.వారందరికీ జ్వరం, ఒళ్లు నొప్పులు. కొద్ది రోజులకు తగ్గిపోతుందనుకున్నారు. …

Read More »

అయ్యా..! యూరియా అంటే పట్టించుకోవట్లే.. కట్ చేస్తే ఇది సీన్..

వర్షాలు విస్తారంగా పడటంతో పంటలకు యూరియా డిమాండ్ పెరిగింది. కానీ సరఫరా సరిగ్గా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే సహకార సంఘాల ఎదుట క్యూ కడుతున్నా యూరియా దొరకకపోవడంతో ఆగ్రహం చెలరేగింది. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పరిస్థితి మరింత విషమించింది.యూరియా కొరత రైతులను తీవ్ర స్థాయిలో వేధిస్తుంది. వర్షాలు విస్తారంగా కురవడంతో అన్ని పంటలకు ఇప్పుడు యూరియా అనేది అత్యంత అవసరంగా మారింది. ఉదయం 5 గంటల నుండే రైతులు పలు సహకార సంఘాల వద్దకు చేరుకొని యూరియా కోసం …

Read More »

ఆ బాలుడికి సీఎం చంద్రబాబు.. అదిరిపోయే గిఫ్ట్‌.. ఏం ఇచ్చాడో తెలుసా?

కాకినాడ జిల్లా జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఒక బాలుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్న ఆయన ఓ చిన్నారి చొక్కాపైనే తన ఆటోగ్రాఫ్ ఇచ్చి బాలుడితో పాలు అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఆ బాలుడు తెగమురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాకినాడ జిల్లా, పెద్దాపురంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. సీఎంతో పాటు ర్యాలీలో ప్రజాప్రతినిధులు, మెడికల్ …

Read More »

రైతులకు గుడ్ న్యూస్.. పట్టా పాస్ బుక్ లేకున్నా లోన్స్.. ఆ భయాలు వద్దన్న మంత్రి..

ఏపీలో రైతులకు ప్రభుత్వం ఉచితంగా కొత్త పట్టా పాస్ బుక్స్ పంపణీ చేయనుంది. ఎటువంటి తప్పులకు తావివ్వకుండా పాస్ బుక్స్ అందిస్తామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా రైతులకు పంట రుణాల కోసం పాస్ బుక్స్ అవసరం లేదని మంత్రి వెల్లడించారు. రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉచితంగా పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. ఈ కొత్త పాస్‌బుక్‌లపై కేవలం ప్రభుత్వ లోగో మాత్రమే ఉంటుందని, ఎటువంటి రాజకీయ పార్టీల చిహ్నాలు ఉండవని ఆయన …

Read More »

SBI బ్యాంక్‌లో ఆడిట్‌కు వచ్చిన సిబ్బంది.. ఓ బుక్‌లో రాసినవి చూడగా..

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్-2లో తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఆడిట్ టీం విచారణలో 4 కోట్ల గోల్‌మాల్ వ్యవహారం బయటపడగా.. మరింత లోతుగా ఆటిట్ చేసిన అదికారులకు కళ్లు బైర్లు కమ్మే అక్రమాల చిట్టా లభించింది. దాదాపు రూ.1.07కోట్ల నగదు, 12.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు( ఐదున్నర కిలోలు) మాయమైనట్లు గుర్తించారు ఆడిటింగ్ టీం. ఈ నగదు, నగల మాయంలో బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్ కీలక నిందితుడిగా తేల్చారు. మేనేజర్ …

Read More »

ఫిరాయింపులపై యాక్షన్ షురూ చేసిన తెలంగాణ స్పీకర్.. ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ!

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్‌ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. శాసనసభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పంపించారు. స్పీకర్‌ నోటీసులపై గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ 3 నెలల్లోగా తన దగ్గరకు వచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న …

Read More »

కూకట్‌పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి మరిన్ని నమ్మలేని నిజాలు.. పక్కా ప్లాన్‌తోనే.!

ఒక పదిహేనేళ్ల పిల్లాడు కిరాతకంగా మర్డర్‌ చేస్తాడా? డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తాడా? పదేళ్ల చిన్నారి సహస్ర హత్య కేసులో ఈ కిల్లర్‌ మైండ్‌సెట్‌ ఇప్పుడు షాకింగ్‌గా మారింది? నెత్తురు చూస్తేనే భయపడే వయసులో, ఎలా నెత్తురు పారించాడు? సహస్ర తల్లిదండ్రుల గుండెకోత అందరినీ కలచివేస్తుంటే, ఈ పిల్లవాడి ప్రవర్తన మరోవైపు చర్చనీయాంశంగా మారింది. కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల సహస్ర బర్త్ దే వేడుకలకూ హాజరైన బాలుడు ఆమెకు కేక్ తినిపించాడు. అదే చేతులతో …

Read More »

ఏనుగులతో భయం భయం.. గజ యాప్ తీసుకొచ్చిన సర్కార్.. ఎలా పనిచేస్తుందంటే..?

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వల్ల ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే ఎక్కడ ఏనుగులు దాడులు చేస్తాయోనని వణికిపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ లాంచ్ చేసింది. ఇది ఎలా పనిచేస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక నూతన యాప్‌ను ప్రవేశపెట్టింది. ‘గజ’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ యాప్.. రాష్ట్రంలో తొలిసారిగా ఏనుగుల కదలికలు, వాటి …

Read More »