Blog Layout

ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..

అమ్మో.. ఒకటో తారీఖు అన్నట్టుగానే ఆగస్టు నెల అప్పుడే వచ్చేసింది. శ్రావణ మాసం ఆరంభంతో ఇక అన్ని పండుగలు, పర్వదినాలు మొదలైనట్టే. ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెట్టింపు సంతోషాన్నిచ్చేదిగా చెప్పాలి. ఎందుకుంటే.. ఈ ఆగస్టులో చాలా ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఆరు, ఏడు రోజులు కాదు ఏకంగా, 15 రోజులు బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వ సెలవులతో పాటు ఈ సెలవుల్లో రెండవ-నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఆ పూర్తి డిటెల్స్‌ ఇక్కడ తెలుసుకుందాం… రిజర్వ్ బ్యాంక్ …

Read More »

కన్న కూతురునే చెరపట్టాలని చూసిన కసాయి తండ్రి కేసులో కోర్టు సంచలన తీర్పు..!

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలనీ.. కూలీ పనులు చేసుకునే లక్ష్మయ్యకు ఇరవై ఏళ్ళ క్రితమే పెళ్లైంది. ముగ్గురు ఆడ పిల్లులు ఉన్నారు. ముగ్గురు పిల్లల తర్వాత భార్యాభర్తల మద్య విభేదాలు వచ్చాయి. దీంతో భర్తను విడిచిపెట్టి భార్య వెళ్లిపోయింది. అయితే ముగ్గురు ఆడపిల్లల్లో చిన్న కుమార్తె ఐదో తరగతి చదువుతూ తండ్రే వద్ద నివసిస్తుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలనీ.. కూలీ పనులు చేసుకునే లక్ష్మయ్యకు ఇరవై …

Read More »

కంత్రిగాళ్ల పని ఖతం.. రంగంలోకి ఖాకీల త్రినేత్రం!.. కంట పడ్డారో మీపని గోవిందా!

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వ్యవస్థను అప్‌డేట్‌ చేయడంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎప్పుడూ ముందే ఉంటారు. సమాజంలోకి ఏ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి దాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇలానే ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఏలూరు జిల్లా పోలీసులు 24 కేసుల్లో నిందితుడిగా ఉన్న పాత నేరస్థుడిని పట్టుకున్నారు. జిల్లాకు చెందిన పాత నేరస్థులను పట్టుకునేందుకు ఏలూరు జిల్లా పోలీసులు ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. నేరస్థులను గుర్తించేందుకు నగరంలో పలు ప్రాంతాల్లో ఫేస్‌రికగ్నిషన్ ఫీచర్‌ కలిగిన సీసీ కెమెరాలను …

Read More »

నేటి నుంచి శ్రీవారి దర్శనం మరింత సులభం..! ఆగస్టు నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వదినాలు ఇవే..

ప్రారంభంలో తిరుమల, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్‌లైన్ కోటా కింద టిక్కెట్లు కోరుకునే భక్తులకు ఈ కొత్త వ్యవస్థ వర్తిస్తుంది. తిరుమలలోని ప్రస్తుత బుకింగ్ కౌంటర్లలో టీటీడీ దాదాపు 800 టిక్కెట్లను, విమానాశ్రయంలో 200 టిక్కెట్లను అందిస్తుంది. ఇకపోతే, ఆగస్టు 2025 లో తిరుమలలో విశేష పర్వదినాలు జరగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరుమల శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో మార్పులు చేసింది. శ్రీవాణి టికెట్ ఉన్న భక్తులకు ఒకే రోజు దర్శనం కల్పించే పైలట్ ప్రాజెక్ట్‌ను …

Read More »

గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీలో అవినీతికి పాల్పడ్డ వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు చోట్ల చేసిన సోదాల్లో భారీగా నగదు కట్టలు, ఆస్తులు గుర్తించారు ఈడీ అధికారులు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 10 చోట్ల సోదాలు నిర్వహించింది ఈడీ. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, …

Read More »

 సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు మర్యాదపూర్వకంగా కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా రావాలని ఆహ్వానించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా …

Read More »

భారత మహిళలో కనిపించిన కొత్త బ్లడ్‌గ్రూప్‌.. ప్రపంచంలోనే ఫస్ట్‌ టైం ఇది..

దక్షిణ భారతీయ మహిళ ప్రపంచ వైద్య చరిత్రలో అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ కలిగి ఉందని గుర్తింపు పొందారు. తీవ్రమైన చాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆమెకు గుండె శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బ్లడ్‌ టెస్ట్‌ చేసిన డాక్టర్లు ఈ షాకింగ్‌ విషయాన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఎవరిలోనూ కనిపించని బ్లడ్‌ గ్రూప్‌ ఈమెకు ఉన్నట్లు గుర్తించారు. ఈ వింత గుణాన్ని గుర్తించేందుకు 10 నెలల పాటు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కర్ణాటకలోని కోలార్‌లో ఒక శాస్త్రీయ అద్భుతం వెలుగులోకి వచ్చింది. …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో మరో డిస్కం ఏర్పాటు!

ఇంధనశాఖపై సమీక్షలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్‌ శాఖ ప్రక్షాళన కోసం సంస్కరణలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌తో పాటు కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. విద్యుత్ విభాగం ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్‌పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ ఉండగా.. …

Read More »

ఆంక్షల మధ్య కొనసాగుతున్న జగన్ నెల్లూరు పర్యటన.. భారీగా తరలివచ్చిన జనాలు!

జగన్‌ పర్యటనతో నెల్లూరు హాట్‌ ల్యాండ్‌గా మారింది. గత పర్యటనలో కనిపించిన సీన్స్‌ మళ్లీ కనిపించాయి. పోలీసుల ఆంక్షల మధ్య కొనసాగుతున్న జగన్‌ పర్యటనలో ఉద్రిక్తతలు నెకొన్నాయి. జగన్‌ను చూసేందుకు భారీగా వచ్చిన జనాలు, కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్చదంగా వచ్చే ప్రజలపై లాఠీ చార్జ్‌ చేయడమేంటని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకున్న జగన్‌ను చూసేందుకు భారీ ఎత్తున జనం, కార్యకర్తలు …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్పీ్కర్‌ మూడు నెలలో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలపై తక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్తు తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను తక్షణ చర్యల తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. …

Read More »