Blog Layout

గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? వీళ్లు ఏం చేశారో తెలిస్తే మీ గుండె గుభేలే..

అనంతపురం జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల గోల్డ్‌ లోన్‌ మోసాలు కలకలం రేపుతున్నాయి. జల్సాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే బ్యాంకుల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడ్డారు. రాంనగర్‌లోని ఓ బ్యాంకులో పనిచేసే వెంకటపల్లి సతీష్‌కుమార్‌.. పాత ఉద్యోగి జయరాములుతో కలిసి గోల్డ్ లోన్ మోసాలు చేశారు. బ్యాంకులో గోల్డ్‌ లోన్ తీసుకున్న వ్యక్తులు తాకట్టు పెట్టిన బంగారాన్ని.. ఆ బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియకుండా సుమారు రెండు కేజీల గోల్డ్‌ను చోరీ చేయడం సంచలన సృష్టించింది. కొందరు కస్టమర్లు …

Read More »

నెల్లూరు బస్టాండ్‌లో భార్యాభర్తలను ఆపిన ట్రాఫిక్ పోలీస్.. ఆ తర్వాత సీన్ ఇది

అర్ధరాత్రి నెల్లూరు బస్టాండ్ దగ్గర కాస్త హడావుడి నెలకొంది. భార్యభర్తలను ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట రూ. 10 వేలు కట్టమని చెప్పారు. ఈలోగా రంగంలోకి స్థానిక ఎమ్మెల్యే దిగారు. ఆ తర్వాత సీన్ జరిగిందిదే.. నెల్లూరులోని వేదాయపాలెం సర్కిల్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. ఓ దంపతులు బైక్ మీద వెళుతుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని రూ. 10 వేలు కట్టమని చెప్పారు. దీంతో సదరు బాధితులు ఏం చేయాలో తెలియక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే …

Read More »

కుషాయిగూడలో మిస్సింగ్‌.. దుర్గం చెరువులో తేలిన డెడ్‌బాడీ! ఏం జరిగిందో..

హైదరాబాద్ కుషాయిగూడలో అదృశ్యమైన వ్యక్తి అనూహ్యంగా దుర్గం చెరువులో శవమై తేలడం కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఆదివారం (జులై 27) ఉదయం మృతుదేహం లభ్యమైంది. దుర్గం చెరువులో మృతుదేహం తేలడంతో మాదాపూర్ పోలీసులకు.. లేక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో చెరువు దగ్గరికి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. మృతుడిని కుషాయిగూడ సైనిక్ పూరికి చేందిన దుర్గా ప్రసాద్ (36)గా పోలీసులు గుర్తించారు. జులై 25న ఇంటి నుంచి వెళ్లిన దుర్గా ప్రసాద్.. రెండు …

Read More »

సృష్టి ఫైల్స్.. తవ్వేకొద్దీ వెలుగులోకి సృష్టి అరాచకాలు.

ఆమె డాక్టరా లేక అక్రమార్జన రుచి మరిగిన మోసగత్తెనా? సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ అరాచకం.. రెండు రాష్ట్రాలకే పరమితం అనుకున్నాం ఇప్పటిదాకా. కాదు.. డాక్టర్‌ నమ్రత మోసాలు దేశవ్యాప్తం. రాజస్తాన్‌ దంపతులకు సంతాన సాఫల్యం చేయిస్తానని చెప్పి అస్సాం దంపతులను పట్టుకొచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో గతంలో ఓ కేసు నమోదైంది. దందా అంతా విశాఖ కేంద్రంగా జోరుగా సాగుతోంది కదా.. వ్యాపారాన్ని ఒరిస్సాకి కూడా విస్తరించింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి.. అసలు డాక్టర్ నమ్రత అడుగుపెట్టని జిల్లానే లేదేమో. అండం బయటకు …

Read More »

పర్యాటకులకు గుడ్‌న్యూస్‌… తెలంగాణ నయాగరకు అనుమతి.. డ్రోన్‌ దృశ్యాలు అద్భుతం

పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. తెలంగాణ నయాగరగా భావించే బొగత జలపాతం సందర్శనకు అధికారులు అనుమతి ఇచ్చారు. వాజేడు మండలంలోని బొగత జలపాతానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అందులోకి దిగిందేకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో అనుమతి లేని జలపాతాలకు వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో బొగత జలపాతం దగ్గర అత్యంత …

Read More »

స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబిలీహిల్స్‌ టికెట్… బైపోల్‌ అభ్యర్థిపై పొన్నం కీలక వ్యాఖ్యలు

జూబిలీహిల్స్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబిలీహిల్స్‌ టికెట్ దక్కుతుదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కాగ్రెస్‌ నేత అజారుద్దీన్‌తో కలిసి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎవరి పేరు ఫైనల్ చేస్తారనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సర్వేలు, అంతర్గత వ్యవహారాలు చూసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇతర నియోజకవర్గాల నేతలకు ఇక్కడ ఛాన్స్‌ లేదని పొన్నం స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌ టికెట్‌ కోసం కాంగ్రెస్‌లో ఇప్పటికే …

Read More »

ట్రాక్‌ కెమెరాకు చిక్కిన చిరుత… హైదరాబాద్‌ శివారులో భయం భయం

హైదరాబాద్‌ శివారులో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. ఎక్కడి నుంచి ఏ చిరుత దాడి చేస్తుందనే భయం వెంటాడుతోంది. 20 రోజుల్లో మూడు కీలక ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని గుర్తించారు. గోల్కొండ పరిసరాల్లో మళ్లీ చిరుత కనిపించింది. రాందేవ్ గూడలో మిలటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటింది. టిక్ పార్క్ నుంచి మిలటరీ ఏరియాలోకి వెళ్లింది చిరుత. తెల్లవారుజామున తిరిగి టెక్ పార్క్ లోకి చిరుత వెళ్లినట్లు ట్రాక్‌ కెమారాలో దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. చిరుత సంచరిస్తుండడంతో మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగి గూడ, …

Read More »

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ జల సవ్వడి.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. రెండు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. ఈ నేపథ్యంలో మంగళవారం నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను మంగళవారం ఎత్తివేశారు. 18 ఏళ్ల తర్వాత నాగర్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. నాగార్జునసాగర్ గేట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సాగర్ ఎమ్మెల్యే రఘువీర్‌రెడ్డి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద …

Read More »

పొలం దున్నతుండగా దూరంగా ఏదో మెరిసింది..! ఏంటా అని దగ్గరికెళితే ఆ రైతు దశ తిరిగింది..?

వజ్రాలు సాధారణంగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి, ఉప్పర్లపల్లి రెవెన్యూ పొలాల్లో దొరుకుతుంటాయి. ఈ ఏడాది కొత్తగా పెండేకల్లు, డీసీకొండ పొలాల్లో వజ్రాలు లభించడం విశేషం అంటున్నారు స్థానికులు. అటు, అనంతపురం జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయి. జిల్లాలోని తట్రకల్లు, రాగులపాడు, గంజికుంట, పొట్టిపాడు, గూళపాళ్యం, కమలపాడు, ఎన్‌ఎంపీ తండాతో పాటూ మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు దొరుకుతాయి. కర్నూల్ జిల్లాలో వ్యవసాయం చేసుకుంటున్న రైతుకు ఒక వజ్రం దొరికింది. దానిని సోమవారం విక్రయానికి పెట్టగా వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి …

Read More »

ఏపీ రైతులకు పండుగ ముందే వచ్చింది.. ఆగష్టు 2న ఖాతాల్లోకి రూ. 7 వేలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ఎన్నికల హామీని నెరవేర్చబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురు చూపుకు తెరపడబోతోంది. ఆగష్టు 2న నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నిధులను సిద్ధం చేసింది. అన్నదాతల కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కలిసి రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభవ నిధులు దక్కేలా నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 2న దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత నిధులు విడుదలవుతుండగా, అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో …

Read More »