యాలకులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. యాలకులు రక్తపోటును నియంత్రిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. డయాబెటిక్ రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిక్ రోగులు రోజూ రెండు నుండి మూడు యాలకులను నమిలితే, వారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రించుకోవచ్చు. వంటగదిలో సుగంధ ద్రవ్యాలు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన బహుమతి. ఉత్తమ ఔషధ గుణాలు కలిగిన సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, నియాసిన్ …
Read More »Blog Layout
విద్యార్థులకు పండగే.. పండగ.. పది రోజుల తర్వాత వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్!
ఇక జూలై నెల ముగియనుంది. మరో ఐదారు రోజులు గడిస్తే ఆగస్టు నెల వచ్చేస్తుంది. అయితే ఆగస్ట్ నెలలో పండగలు, ప్రత్యేక రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హలిడేస్ ఎక్కువగా వస్తుంటాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ నెలలో వరుస సెలవులు వస్తున్నాయి.. పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులకు పండగే. చదువులతో తలమునకలవుతున్న విద్యార్థులకు ఒక రోజు సెలవు వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. అదే వరుస సెలవులు వస్తున్నాయంటే చాలు …
Read More »ఈపీఎఫ్‌లో కీలక మార్పు.. మీ పీఎఫ్‌లో డబ్బులు లేకపోయినా నామినీకి రూ.50,000
ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) EPFO కింద నడుస్తుంది. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఊహించని మరణం సంభవించినప్పుడు వారికి బీమా రక్షణ కల్పించడం దీని ఉద్దేశ్యం. ఈ పథకంలో ఉద్యోగి తన జేబు నుండి.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకంలో ప్రధాన మార్పులు చేసింది. లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి ఇప్పుడు ఎటువంటి కఠినమైన షరతులు ఉండవు. …
Read More »ITR 2025: మీరు ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు!
మీరు పన్ను చెల్లింపుదారులైతే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాలనుకుంటే మీ ఆదాయానికి ఐదు ప్రధాన వనరులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వనరులు జీతం, ఆస్తి నుండి అద్దె ఆదాయం, బంగారం, షేర్లు లేదా రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే లాభం, వ్యాపారం నుండి వచ్చే లాభాలు, స్థిర డిపాజిట్లపై వడ్డీ (FDలు) వంటి ఇతర వనరులు. ప్రతి పన్ను చెల్లింపుదారుడి ఆదాయం వీటి నుంచి వస్తుంటుంది. ఉదాహరణకు ఒక …
Read More »డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిన 14 మందిని పోలీసులు ఏం చేశారంటే..?
హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించిన 14 మంది శిక్షకు బదులుగా చికిత్సను ఎంచుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. తెలంగాణ పోలీసుల EAGLE టీమ్.. తెలిపిన ప్రకారం.. వీరంతా గవర్నమెంట్ గుర్తింపు పొందిన డీ-అడిక్షన్ కేంద్రాల్లో చికిత్సకు ముందుకు వచ్చారు. వారు కావాలనుకున్నది శిక్ష రద్దు కాదు, తమ తప్పును ఒప్పుకుని జీవితాన్ని మార్చుకునే అవకాశం అని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసిన వారి కోసం… NDPS చట్టంలోని 64-A సెక్షన్ ఒక మార్గం చూపుతోంది. వ్యసనానికి లోనైనవారు …
Read More »హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జ్.. ఈసారి ఆ ప్రాంతం టూరిస్ట్ స్పాట్ కావడం ఖాయం..
హైదరాబాద్ మహానగరం మరింత సొబగులు అద్దుకొనుంది. చారిత్రక నేపథ్యంతో కూడిన మీరాలం చెరువుపై ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి భాగ్యనగరానికి ఆకర్షణగా నిలిచి.. పర్యాటకానికి ఓ కొత్త దిక్సూచి అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మీరాలం చెరువును కేంద్రంగా చేసుకుని మరో అద్భుతమైన వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.430 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ వంతెన నిర్మాణ బాధ్యతను మూసీ నది అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డీసీఎల్)కు అప్పగిస్తూ …
Read More »ఆ డ్రోన్ల చక్కర్లు అందుకేనా..? రాష్ట్రంలో ఇక ఆ పంట పండిస్తే అంతే సంగతులు..!
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో గంజాయి సాగుపై పోలీసులు ప్రత్యేక డ్రోన్లతో నిఘా పెట్టారు. కొండలు, గుట్టలు, లోయల మాటున దాగి ఉన్న గంజాయి సాగును గుర్తించేందుకు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. రంగంలోకి స్వయంగా పాడేరు ఎస్పీ అమిత్ బర్దార్ దిగి.. కొండల మాటున లోయల్లో గంజాయి సాగు జరిగుతున్నట్టు గుర్తించి.. మూల గంజాయి పంట సాగు జరిగినా దాన్ని ధ్వంసం చేసే విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా అరకులోయ అడవి ప్రాంతంలో గంజాయి సాగుపై సర్వే నిర్వహించారు. డుంబ్రిగూడ మండలం కించమండ పరిధి …
Read More »ఆహా.! ఎంత చల్లచల్లని కబురు.. ఉరుములతో భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే
కాస్కోండి… ఇక వానలే వానలు…! రాబోయే రెండ్రోజుల వర్షబీభత్సనానికి.. నిన్నా-ఇవాళ కురిసిన వర్షాలే చిన్న శాంపిల్ అన్న సంకేతాలిచ్చాడు వరుణుడు రాగల 48 గంటలు వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలు, బంగ్లాదేశ్ ప్రాంతాలలో ఏర్పడిన వాయుగుండం గత 3 గంటల్లో గంటకు 13 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, 0730-0830 గంటల మధ్య పశ్చిమ బెంగాల్ దాని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాలను …
Read More »తిరుపతి శివాలయంలో కళ్లు తెరిచిన శివలింగం.. పరమేశ్వరుడి మహత్యమేనంటూ..
టెంపుల్ సిటీ తిరుపతిలో నిన్న రాత్రి నుంచి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. శివలింగం కళ్ళు తెరిచిందని విస్తృత ప్రచారం జరుగుతుంది. జనం కూడా పెద్ద ఎత్తున చూసేందుకు ఎగబడగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ గా మారింది. తిరుపతిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్థానిక శివాలయంలోని శివలింగం కళ్లు తెరిచింది. ఈ వార్త తెలిసి స్థానికులంతా పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. కళ్లు తెరిచిన పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. కొందరు ఆ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్స్‌లో రికార్డు చేశారు. …
Read More »బడ్డీ కొట్టలో చాక్లెట్లు తెగ తింటున్న పిల్లలు… అధికారులు ఆరా తీయగా
విజయవాడలో బడ్డీ కొట్లలో అమ్ముతున్న చాక్లెట్లను.. పిల్లలు తెగ తింటున్నారు. అవే కొనిపెట్టాలని తల్లిదండ్రుల వద్ద మారాం చేస్తున్నారు. స్కూళ్లకు సమీపంలోని బడ్డీ కొట్లలో కూడా వీటిని విక్రయిస్తున్నారు. ఈ విషయం గురించి సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా.. విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. విజయవాడలో ఉంటున్న పిల్లల తల్లిదండ్రులూ జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటకొస్తే ఏ ప్రాంతంలోని తల్లిదండ్రులు అయినా పిల్లలు విషయంలో ఇప్పుడు అలెర్ట్ అవ్వాల్సిన సమయం. ఇప్పుడు మీకు చెప్పబోయే న్యూస్ ఏమాత్రం లైట్ తీసుకోకండి. విజయవాడలో ఈగల్ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal