Blog Layout

ఎన్టీఆర్‌ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్‌ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు జులై 22 నోటిఫికేషన్‌ విడుదల.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్‌ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ …

Read More »

ఏపీపీఎస్సీ అటవీ శాఖ నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే?

ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ మొత్తం 691 పోస్టులకి జులై 14న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 100 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ శాఖలో వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ మొత్తం 691 పోస్టులకి జులై 14న నోటిఫికేషన్‌ …

Read More »

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక ఇదొక జీవనాధారంగా మారింది. కానీ పలుచోట్ల ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకోవడం గమనార్హం. కొన్ని చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శ్రామికుల పైసలు దోచుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరికొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లతో మంచి ఉంటూ పనికి రాకున్నా వచ్చినట్లు అటెండెన్స్ వేయించకుంటారు. ఈ అక్రమాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయి అవకతవకలు జరగకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై పనిచేసే …

Read More »

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సొంత ఇంటి పార్టీలో సమస్యలకు కారణం ఇంటి వాస్తు బాగా లేకపోవడమేనా? కవిత ఇంటిలో జరుగుతున్న మార్పులు ఏంటి..? ఇంటి వాస్తు.. ఇది చాలామంది నమ్మకం. ఈ వాస్తు బాగుంటేనే మనకు మంచి జరుగుతుంది అని.. తాము చేసే అన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తామని నమ్ముతూ ఉంటారు. అందులో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్సీ కవిత కూడా …

Read More »

నగరంలో భారీ వర్షం – అత్యవసరం అయితే తప్ప బయటకి రావొద్దు

హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం నాన్‌స్టాప్‌గా పడుతూనే ఉంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మియాపూర్, మలక్‌పేట్, చంచల్‌గూడ, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. చాలాచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి వచ్చాయి. కొన్నిచోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షంతో నెలకొన్న పరిస్థితులపై …

Read More »

సుప్రీంకోర్టులో నిమిష ప్రియ కేసు విచారణ… తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా

యెమెన్‌ దేశంలో కేరళ నర్స్‌ నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఈ మేరకు కోర్టుకు తెలిపారు పిటిషనర్‌ నిమిష తల్లి తరపు న్యాయవాది. శుక్రవారం సుప్రీంకోర్టులో కేరళ నర్సు నిమిష ప్రియ కేసు విచారణ చేపట్టింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ సందర్భంగా న్యాయవాది ఉరిశిక్ష అమలు వాయిదా పడినట్లు వెల్లడించారు. బ్లడ్ మనీ గురించి చర్చించేందుకు యెమెన్ వెళ్లాల్సి ఉందని, అక్కడ ఒక మత గురువు ఈ వ్యవహారంలో భాగమయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన …

Read More »

అర్ధరాత్రి చోరీకి వచ్చి.. గుర్రుపెట్టి నిద్రపోయిన దొంగ దొర! ఆ తర్వాత ఏం జరిగిందంటే

 ఓ దొంగ గారు అర్ధరాత్రి ఊరంతా సద్దుమనిగాక పిల్లిలా దొంగతనానికి వచ్చాడు. చప్పుడు చేయకుండా ఓ ఇంట్లో చొరబడ్డాడు. ఇంట్లో దూరిన దొంగ చకచకా వచ్చిన పని కానిచ్చి జారుకోవాలనే విషయం మర్చిపోయాడు. అంతే.. అసలే అర్ధరాత్రి, ఆపై నిద్ర ముంచుకు రావడంతో చక్కగా ఫ్యాన్‌ కింద పడుకుని గురకలు పెట్టి మరీ నిద్రపోయాడు. ఇంతలో బయటకు వెళ్లిన ఇంటి యజమాని ఇంటి తలుపులు తీసి ఉండటం చూసి అవాక్కయ్యాడు. ఇంట్లోకి తొంగి చూడటంతో లోపల గుర్తుతెలియని అగంతకుడు హాయిగా నిద్రపోవడం చూసి వెంటనే …

Read More »

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో మరణించింది. తల్లి మృతిని తట్టుకోలేక కుమార్తె తల్లి శవం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఆరు గంటల వ్యవధిలో ఇద్దరూ మరణించడం కుటుంబాన్ని, గ్రామస్తులను కలచివేసింది. తల్లీ కూతుళ్ల మధ్య బంధం ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. తల్లి మృతికి తట్టుకోలేక కుమార్తె కూడా తల్లి మృతదేహం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు వదిలింది. విజయనగరం జిల్లా భోగాపురంలో …

Read More »

అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..

అందమైన సాగరతీర నగరం విశాఖ.. కొందరు అక్రమార్కుల బారినపడి కొన్ని విషయాల్లో మసకబారిపోతోంది. అడపా దడపా డ్రగ్స్ రాకెట్లు, సీజన్‌కోసారి కిడ్నీ అమ్మకం దందాలు.. పోలీసుల్ని సైతం హైరానా పట్టిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఒడిషా కేంద్రంగా ఒక కిడ్నీ రాకెట్ విశాఖ మీద కన్నేసినట్టు ఖాకీలకు వాసనొచ్చింది. ప్రాణం పోయాల్సిన డాక్టర్లే కిడ్నీ బ్రోకర్లుగా మారడం ఇక్కడ బాధాకరమైన కొసమెరుపు. వైజాగ్‌లోని ఒక హోటల్‌ను అడ్డాగా మార్చుకుని కిడ్నీ వ్యాపారానికి పాల్పడే ముఠా ఒకటి విశాఖ పోలీసుల రాడార్‌లోకొచ్చింది. జనవరి 27న తొలిసారి ఫోన్ చేసి.. …

Read More »

తెలంగాణ రాజకీయాల్లో చిట్ చాట్ చిటపటలు… కౌంటర్‌.. రీకౌంటర్లతో ఢీ అంటే ఢీ

తెలంగాణ రాజకీయాలకు చిట్‌చాట్ మంటలు అంటుకున్నాయి. గంజాయ్ బ్యాచ్ అంటూ అధికారపక్షం విపక్షాన్ని టార్గెట్ చేస్తుంటే… డైవర్ట్ రాజకీయాలు అస్సలొద్దు. దమ్ముంటే నిరూపించూ అంటూ విపక్షం అధికార పార్టీకి సవాల్ విసురుతోంది. అసలే తెలంగాణ రాజకీయాలు బనకచర్ల ఇష్యూతో భగభగ మండుతున్నాయి. ఇప్పుడు అగ్నికి ఆజ్యం అన్నట్లుగా చిట్‌చాట్ చిటపటలు కూడా అంటుకున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో మాజీ మంత్రి కేటీఆర్ ను గంజాయి బ్యాచ్‌తో పోల్చడంతో వివాదం రాజుకుంది. కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని, …

Read More »