Blog Layout

ఏ క్షణమైనా సర్పంచ్‌ ఎన్నికల షెడ్యూల్… రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం

తెలంగాణలో స్థానికసంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమైంది. హైకోర్టు గడువులోపు ఎన్నికలు పూర్తిచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సర్కార్ సూచించింది. ఇప్పటికే ZPTC, MPTC, సర్పంచ్‌ స్థానాలు ఖరారు చేసింది. ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటా కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్‌ …

Read More »

మందుబాటులు బీ కేర్‌ఫుల్‌.. ఇక పట్టపగలు కూడా చుక్కలే.. అలా దొరికారో అంతే సంగతి!

నగరంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మందేసి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్ల పనిపట్టేందుకు ఇకపై పగటి పూట కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే బుధవారం హైదరాబాద్‌లోని మింట్​ కాంపౌండ్​ ప్రాంతంలో హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ స్పెషల్​ డ్రైవ్​లో నగర ట్రాఫిక్​ జాయింట్​ సీపీ జోయల్​ డేవిస్ సైతం​ పాల్గొని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా …

Read More »

బండి సంజయ్‌కి మరోసారి సిట్‌ నోటీసులు… విచారణ కు సమయం ఇవ్వాలని కోరిన పోలీసులు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు రాక తరువాత ఈ కేసు విచారణలో సిట్ మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. విచారణలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి సిట్‌ మరోసారి నోటీసులు పంపింది. విచారణకు సమయం ఇవ్వాలని సిట్‌ అధికారులు నోటీసుల్లో కోరారు. దీంతో ఈనెల 24న విచారణకు బండి సంజయ్‌ సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బండి సంజయ్‌ని సిట్‌ అధికారులు …

Read More »

ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ మారిందోచ్‌.. కొత్త తేదీలు ఇవే

ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జులై 13న నుంచి వెబ్‌ ఐచ్ఛికాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. అది జులై 16 నుంచి ప్రారంభమైంది. దీంతో మిగతా తేదీల్లోనూ మార్పు చేస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది.. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జులై 13న నుంచి వెబ్‌ ఐచ్ఛికాలు ప్రారంభం …

Read More »

టెన్త్, ఇంటర్‌ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు!

రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 904 అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే (SWR).. హుబ్బళ్లి, మైసూరు, బెంగళూరు డివిజన్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ …

Read More »

రాయలసీమ నీటి కష్టాలకు రామ్‌రామ్‌… నేడు హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి

సీమ ప్రజల నీటి నిరీక్ష ముగిసింది. హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నీటిని విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో పర్యటించనున్నారు. హంద్రీనివా ప్రాజెక్టులో భాగంగా మల్యాల నుంచి ఫేజ్‌ 1, 2 కింద 554 కిలో మీటర్ల మేర కాలువ లైనింగ్‌, వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ పనులను పరిశీలించిన అనంతరం హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి ఇవ్వనున్నారు. ఆపై మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేస్తారు. నీటి విడుదల …

Read More »

ఇక సర్కార్‌ బడులన్నింట్లో ఇంటర్నెట్, కంప్యూటర్‌ ల్యాబ్‌ సౌకర్యాలు.. మంత్రి లోకేష్‌ కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అన్నింటికీ ఇక కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ఇంటర్నెట్‌ సదుపాయం రానుంది. ఈ మేరకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. తాజాగా పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై మంత్రి లోకేషన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ను పునర్‌ వ్యవస్థీకరించి, నిపుణులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే బోర్డు మీటింగ్‌ నిర్వహించి, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్టెమ్‌ కార్యకలాపాలు …

Read More »

సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో వరుస దొంగతనాలు సంచలనం రేపుతున్నాయి. సాక్షాత్తు శ్రీశైలం ఆలయంలో పనిచేసే పరిచారకుడే తన చేతివాటం ప్రదర్శించాడు. శ్రీశైలం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ నుంచి 24,200 రూపాయలను దొంగలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. రోజువారి భద్రతా చర్యలలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాలలో మొత్తం 600 కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతీరోజు ఆలయ ఈఓ శ్రీనివాసరావు పలుమార్లు సి.సి. కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రధానంగా క్యూ కాంప్లెక్సు, …

Read More »

బెజవాడలో పట్టపగలు జంట హత్యల కలకలం.. పరారీలో రౌడీ షీటర్‌!

విజయవాడలో నిన్న డబల్ మర్డర్లు చేసిన అనంతరం పరారైన రౌడీ షీటర్ జమ్మూ కిషోర్ కోసం 8 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. క్యాటరింగ్ కు వెళ్లిన సమయంలో వచ్చిన డబ్బు పంపకాల్లో వచ్చిన వివాదంలో వెంకట్రావు, రాజుపై కిశోర్ కత్తితో దాడి చేశాడు. మృతుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. వెంకట్రావు బంధువులకు కబురు చేయగా.. మర్డర్ జరిగి 12 గంటలు అవుతున్న విజయవాడలో రాజు కుటుంబ సభ్యులు ఎవ్వరో తెలియక పోలీసులు తర్జన బర్జన పడుతున్నారు.. విజయవాడ పట్టణంలో పట్టపగలు ఇద్దరు …

Read More »

ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం డబ్బు ముందే కట్టే పనిలేదు – సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకంలో కీలక మార్పు చేసింది. ఇకపై లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు. రాయితీ డబ్బులు ముందుగా ఖాతాల్లో జమ అవుతాయి. ముందుగా డబ్బులు చెల్లించే అవసరం ఇక లేదు. ప్రస్తుతం ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా రెండు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఏపీలోని కూటమి సర్కార్ దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకుని ముందుగా డబ్బులు చెల్లించాల్సి …

Read More »