Blog Layout

శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహ్మోత్సవాల డేట్ వచ్చేసింది.. బ్రేక్ దర్శనాల సహా పలు దర్శనాలు రద్దు.. గరుడ వాహన సేవ ఎప్పుడంటే..

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అప్పుడే సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందిస్తోంది. నిర్దేశిత సమయంలోపే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్‌ వెంకయ్య చౌదరి టీటీడీ ఉన్నతాధికారుల తో జరిపిన సమీక్ష దిశా నిర్దేశం చేశారు. తిరుమలలోని అన్నమయ్య …

Read More »

రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం..

రాజాసింగ్‌ రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించింది. BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై రాజాసింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్టీకి రాజీనామా ఇచ్చారు. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా లేఖను పంపగా.. రాజాసింగ్‌ రాజీనామాను జేపీ నడ్డా ఆమోదించారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఇటీవల జరిగిన BJP రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. …

Read More »

బెట్టింగ్ మాఫియాపై ఈడీ ఫోకస్.. ఈ సెలబ్రిటీలే నెక్స్ట్ టార్గెట్..?

బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో వారిలో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఈడీ టార్గెట్ ఏంటీ.? అన్నది ఉత్కంఠగా మారింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడంతో సినీ సెలెబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్స్‌పై ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. తెలంగాణలో బెట్టింగ్ యాప్ బారిన పడి అమాయక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుండగా పోలీసులు బెట్టింగ్ …

Read More »

రాజకీయ అస్త్రంగా మామిడి రైతు గోస.. ధర పతనానికి కారణం అదేనా..?

చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట బాగా పండిందనే సంతోషమే వారిలో కనిపించడం లేదు. ఎందుకంటే మామిడి ధర పతనమవడం వారిని కలవరపెడుతుంది. అటు ప్రభుత్వం కూడా అరకొరగానే వారి సమస్యను పట్టించుకోవడంతో మామిడికి మద్ధతు ధర గాలిలో దీపంలా మారింది. మామిడి ధర.. ఇప్పుడు రచ్చగా మారింది. ఏపీలో రాజకీయాన్ని రంజుగా మార్చింది. మద్దతు ధర అందకపోవడంతో రోడ్డెక్కిన రైతాంగం సమస్య రాజకీయ రంగు పులుముకుంది. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది మామిడి ధర పతనానికి అసలు కారణమేంటి. …

Read More »

రెండో విడత జీపీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టుల భర్తీకి మరోమారు రెవెన్యూశాఖ సమాయాత్తమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా రెండో విడతగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 10,954 జీపీవో పోస్టులను భర్తీ చేసింది. గతంలో వీఆర్‌ఏ, వీఆర్‌వో పోస్టులకు ఎంపికైన వారికి అవకాశం కల్పించింది. ఇందులో ఐదు వేల మంది దరఖాస్తు చేసుకోగా 3,550 మంది జీపీవోలుగా ఎంపియ్యారు. …

Read More »

ఇదేందయ్యా ఇది.. అవినీతి అధికారులే వారి టార్గెట్.. తీరా చూస్తే వాళ్లే..

అవినీతి అధికారులే వారి టార్గెట్. కరప్షన్ ఆఫీసర్లను పట్టుకోవడం వారి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడమే వారి పని. ఇలా చాలమంది ప్రయోగం చేశారు. చాలా వరకు వారి ప్లాన్స్ సక్సెస్ అయ్యాయి కూడా. ఈ క్రమంలో ఓ వీఆర్వోను అదేవిధంగా బెదిరించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వారి ప్లాన్‌కు ఎండ్ కార్డు పడింది. తిరుపతి జిల్లాలో నకిలీ ఆఫీసర్స్ ముఠా గుట్టు రట్టయింది. విజిలెన్స్ అధికారులమంటూ రంగంలోకి దిగిన ఫేక్ ఆఫీసర్స్.. కరప్షన్ ఆఫీసర్ టార్గెట్‌గా వ్యూహం పన్నారు. నలుగురు …

Read More »

జగన్మోహన్ రావు సహా ఐదుగురికి 12 రోజులు రిమాండ్… పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు

HCA అక్రమాల్లో అరెస్టైన అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ఐదుగురికి 12 రోజుల పాటు రిమాండ్ విధించింది మల్కాజ్‌గిరి కోర్టు. పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. 2024 మే కంటే ముందు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఘటనలకు సంబంధించి తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ 9న ఫిర్యాదు చేశారు. HCA ఎన్నికల్లో నిలబడటానికి జగన్మోహన్‌ రావు అక్రమ ప్రవేశం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా అధ్యక్షుడిగా గెలవడానికి నకిలీ పత్రాలు, …

Read More »

ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజు పెంపుకు CBITకి హైకోర్టు అనుమతి.. నేడు తుది తీర్పు!

2025-26 నుంచి 2027-28 వరకు బ్లాక్ పీరియడ్‌కు బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల ఫీజును పెంచుకునేందుకు చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) చేసిన అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. CBIT వసూలు చేసే ఫీజుల వివరాలు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని TG Eapcet అడ్మిషన్ల కన్వీనర్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఆదేశించారు. బీటెక్‌ కోర్సులకు ఏడాదికి రూ.2,23,000గా, MTech కోర్సుకు రు.1,51,600, MBA/MCA కోర్సుకు రు.1,40,000లకు పెంచేందుకు కోర్టు CBITని అనుమతించింది. పెరిగిన …

Read More »

తెలంగాణ నీట్‌ యూజీ 2025 ర్యాంకర్ల లిస్ట్‌ వచ్చేసింది.. ఫుల్‌ జాబితా ఇదే!

నీట్‌ యూజీ 2025 పరీక్షలో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 43,400 మంది అర్హత సాధించారు. ఈ మేరకు ఎంపిక జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. ఇది కేవలం నీట్‌లో అర్హత పొందిన అభ్యర్థుల వివరాలు తెలిపే జాబితా మాత్రమేనని, మెరిట్‌ జాబితా కాదని వర్సిటీ స్పష్టం చేసింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఎన్‌సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్, ఎస్‌సీసీఎల్‌ మెరిట్‌ జాబితాను విడిగా విడుదల చేస్తామని పేర్కొంది. …

Read More »

 రైల్వే స్టేషన్‌లో స్టార్ హోటల్‌ను మించి.. మ్యాటర్ తెలిస్తే ప్రయాణీకులు క్యూ కట్టేస్తారంతే

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే జర్నీ సౌకర్యవంతంగా ఉండాలి. అలసిపోయే ప్రయాణికుడికి కాస్త రిలాక్స్ కుదిరితే శారీరకంగా, మానసికంగా ఆ సంతృప్తే వేరు. ట్రైన్ దిగిన తర్వాత.. గమ్యస్థానానికి వెళ్లే ముందు గాని.. రైల్వే స్టేషన్‌కు వెళ్లి గంటల తరబడి రైలు కోసం వేచి చూస్తున్నప్పుడు గానీ.. కాస్త విశ్రాంతి దొరికితే చాలు అన్నట్టుగా ఉంటుంది. చాలామంది ప్రయాణికులు.. తమ జర్నీలో మిగిలిన సమయం కాస్త రిలాక్స్ అవ్వాలని చూస్తూ ఉంటారు. అటువంటివారు ఫ్లాట్‌ఫార్మ్‌పై ఉన్న కుర్చీ పైనో.. లేక …

Read More »