Blog Layout

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం.. స్పందించిన రాజ్‌భవన్.. ఇదే అసలు విషయం!

తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు అమోదం లభించిందంటూ వార్తలు వెలువడ్డాయి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వార్తపై రాజ్‌భవన్ అధికారులు స్పందించారు. ఈ వార్త అవాస్తమని గవర్నర్ బంగ్లా అధికారులు తెలిపారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉందని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ.. జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొందని వివరించారు. ఇదిలావుంటే, తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్లకు రాష్ట్ర …

Read More »

 శతకం కొట్టి సెలబ్రేషన్స్‌కు ముందు పోలీసులకు చిక్కాడు..

చదువుల్లో విద్యార్థులు వందకు 100 మార్కులు సాధిస్తే.. తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. క్రికెట్ లో సెంచరీ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. తమ ప్రొఫెషన్ లో వందకు వందశాతం సక్సెస్ కావాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి సక్సెస్ రీచ్ అయితే .. ఎంజాయ్ చేస్తుంటారు. పట్టుమని పదో తరగతి చదవకపోయినా.. మూడు పదుల వయస్సులోనే సెంచరీ దాటేశాడు. అందరూ ప్రొఫెషనల్స్ మాదిరిగానే శతకం సాధించాడు.. ఆ శతకానుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణం …

Read More »

గ్రేట్ మేడమ్.. 4 నెలల్లో 30 లీటర్ల చనుబాలు దానం చేసిన గుత్తా జ్వాల

బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థులను ఓడించిన గుత్తా జ్వాల.. ఇప్పుడు తల్లి పాలతో పసిపాపలకు ప్రాణం పోస్తోంది. నాలుగు నెలల్లో 30 లీటర్ల పాలు దానం చేసి అరుదైన సేవ అందించిన జ్వాల.. ప్రస్తుతం రోజూ 600 ml పాలు ప్రభుత్వ ఆస్పత్రుల శిశువులకు పంపుతోంది. బ్యాడ్మింటన్ కోర్టులో షాట్లు కొడుతూ ప్రత్యర్థులను మట్టికరిపించిన గుత్తా జ్వాల.. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం మరింత గొప్ప పోరాటం చేస్తోంది. ఆమెకు ఇది మెడల్ గెలిచే పోటీ కాదు. ప్రాణాలను కాపాడే పోరాటం. గత నాలుగు నెలల్లో, …

Read More »

గుడ్‌న్యూస్.. ఇకపై మరింత ఈజీగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ.. క్షణాల్లో పొందొచ్చు.. ఎలానో తెలుసా?

రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ’ కేంద్రాల్లో నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు ఇకపై మీ సేవాల సెంటర్ల నుంచి నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. ఇంతకు ముందు మనకు క్యాస్ట్‌ పర్టిఫికెట్‌ కావాలంటే దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా.. ఎమ్మర్వో ఆమోదం పొందిన తర్వాతనే తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని …

Read More »

హైకోర్టు గ్రూప్ 1 తీర్పుపై డివిజ‌న్ బెంచ్‌కు టీజీపీఎస్సీ.. నిరుద్యోగుల్లో గందరగోళం

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల ఫలితాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు రీవాల్యూయేషన్‌ చేస్తే సాంకేతిక సమస్యలు రావొచ్చని టీజీపీఎస్సీ అభిప్రాయపడుతుంది. గ్రూప్‌ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్‌లు జారీ చేశారు. …

Read More »

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల.. శరవేగంగా ఏర్పాట్లు!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పనుల్లో నిమగ్నమైంది. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీలోని అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించిన ఈఓ విస్తృత తనిఖీలతో సమాయత్తం చేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరిపేందుకు టీటీడీ సన్నద్దం అయ్యింది. బ్రహ్మోత్సవాలకు ఈ నెల 23 న అంకురార్పణ జరగనుంది. 24 న శాస్ట్రోక్తంగా ద్వజారోహణం జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 …

Read More »

తిరుమల శ్రీవారు ధరించే పూలమాలల.. వాటి ప్రత్యేక ఏంటో మీకు తెలుసా?

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. వెల కట్టలేని బంగారు నగలు, వజ్ర వైడూర్యల ఆభరణాలున్నఅలంకార ప్రియుడు. అంతటి బంగారు స్వామి సేవలో అనునిత్యం తరిస్తున్న సుగంధ పుష్ప మాలలు ఏంటో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. పుష్పాలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది. పవిత్రమైన తిరువాయ్‌ మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొన్నట్లు స్వామి వారికి నిత్య కైంకర్యాలలో సుగంధ వాసనలు వెదజల్లే ఎన్నో రకాల పుష్పాలు అర్చకులు వినియోగిస్తారు. ఆపాదమస్తకం వివిధ …

Read More »

ఆమెకు తరచూ తలనొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మెదడులో దాన్ని చూసి డాక్టర్లు షాక్

పరాన్న జీవులు ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని వైద్యులు అన్నారు. ఇవి వార్మ్‌ బ్లడెడ్‌ జంతువుల సజీవ కణజాలాన్ని తినేస్తూ జీవిస్తాయని అన్నారు. అవి శరీర గాయాల ద్వారా రోగి శరీరంలోకి వెళ్తాయని, సకాలంలో వైద్యం అందకపోతే అవయవాల్లోకి ప్రవేశించి ప్రాణాలకు ముప్పు.. ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. కొన్ని చికిత్సలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన ఆపరేషన్‌ నిర్వహించారు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. వైద్యులు శస్త్రచికిత్స చేసి మహిళ మెదడు నుంచి పరాన్నజీవిని తొలగించారు. తిరువూరుకు చెందిన 50 …

Read More »

అప్పుడే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలు వచ్చేశాయ్‌.. ఈసారి ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్‌!

రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలను విడుదల చేసింది. రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు(జనరల్, వొకేషనల్), కాలేజీలో చదవకుండా ప్రైవేట్‌గా హ్యూమానిటీస్ గ్రూప్‌లో పరీక్షకు.. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలను విడుదల చేసింది. రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు(జనరల్, వొకేషనల్), కాలేజీలో చదవకుండా ప్రైవేట్‌గా హ్యూమానిటీస్ గ్రూప్‌లో పరీక్షకు సిద్ధం అవుతున్న …

Read More »

పవిత్ర శ్రీశైలంలో పట్టుబడిన మద్యం బాటిల్లు, అధికారులు ఏం చేశారో తెలిస్తే షాక్”

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఆలయ నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.ఇందులొ భాగంగానే శ్రీశైలం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండేళ్లలో 43 కేసులలో పట్టుబడిన మద్యం 1,197 బాటిళ్లు 186 లీటర్ల నాటు సారాయి శ్రీశైలం మల్లమ్మ కన్నీరు వద్ద డంపింగ్ యార్డ్‌లో ట్రాక్టర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మద్యం సారా ఇతర మత్తు పదార్థాలను సేవించడం నిషేధించారు. దేవదాయ ధర్మదాయ చట్ట ప్రకారం ఆలయ పరిసరాల్లో వాటిని నిషేధిస్తూ అమలు …

Read More »