Blog Layout

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఎగిసిపడ్డ మంటలు

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయం సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా షాప్‌ మొత్తం విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. రెండు షాపులు గద్ధమయ్యాయి. భారీ అగ్ని కీలలు ఎగిసిపడటంతో స్థానికులతోపాటు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బుధవారం(జూలై 03) తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కి …

Read More »

ఈ విషయం తెలుసా… కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు షురూ

కర్నూల్‌ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అత్యధిక ఒత్తిడి ఈ విమాన సర్వీస్‌పైనే ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు .ఏపీలో విమాన సర్వీసులు ప్రయాణికులకు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూల్ టు విజయవాడ విమాన సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర విమానాయానశాఖమంత్రి రామ్మోహన్‌నాయుడు. ఇప్పటికే కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్నూల్‌ నుంచి విజయవాడకు …

Read More »

వాన వాన వెల్లువాయే.. తెలుగు రాష్ట్రాలు మురిసిపాయే.. ఈ జిల్లాలకు

ఆంధ్రప్రదేశ్‌లో రోజంతా మేఘాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తూ ఉంటుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణలోని 19 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ద్రోణి ఆగ్నేయ రాజస్థాన్ నుండి వాయువ్య బంగాళాఖాతం …

Read More »

కుప్పానికి జల కళ వచ్చేసిందోచ్‌.. వరాలు కురిపించిన సీఎం చంద్రబాబు!

కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 1292.74 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రారంభించారు. హంద్రీనీవా ప్రాజెక్టు, సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లు, గ్యాస్ కనెక్షన్లు, పెన్షన్లు, రోడ్లు, తాగునీరు వంటి పలు అంశాలపై దృష్టి సారించారు. గత ప్రభుత్వాలను విమర్శిస్తూ, సుపరిపాలనపై దృష్టి పెడుతున్నామని ప్రకటించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తన నియోజకవర్గం కుప్పంలో పలు అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రారంభించారు. ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమంలో భాగంగా సీఎం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.1292.74 …

Read More »

కొంప ముంచిన SBI క్రెడిట్‌ స్కోర్.. చేతికందిన బ్యాంకు ఉద్యోగం హుష్‌..! కోర్టు షాకింగ్ ట్విస్ట్..

బ్యాంకింగ్‌ ఉద్యోగార్ధులకు క్రెడిట్ కార్డు హిస్టరీ గండంగా మారింది. పేలవమైన క్రెడిట్‌ కార్డు హిస్టరీ కలిగిన వారికి నిర్మొహమాటంగా ఉద్యోగ ఆఫర్‌లను రద్దు చేస్తున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పూర్ క్రెడిట్‌ కార్డు హిస్టరీ కలిగిన వారికి ఉద్యోగం ఉచ్చేందుకు నిరాకరించింది. ఎస్బీయే నిర్ణయాన్ని ఇటీవల మద్రాస్ హైకోర్టు తీర్పు సమర్థించడం విశేషం. ఉద్యోగార్థులకు, ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో ఈ తీర్పు స్పష్టం చేసింది..క్లీన్ క్రెడిట్ రికార్డ్, అధిక క్రెడిట్ స్కోరు, స్థిరమైన …

Read More »

రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పాసైతే చాలు! సికింద్రాబాద్‌లో పోస్టులున్నాయంటే..

దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పలు విభాగాల్లో టెక్నీషియన్ గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టులకు ఆర్‌ఆర్‌బీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,238 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 183, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,055 వరకు ఉన్నాయి. ఈ పోస్టులను సికింద్రాబాద్ సహా అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, …

Read More »

మిడిల్‌ క్లాస్‌కు గుడ్‌ న్యూస్‌.. GST స్లాబుల మార్పు..? ధరలు భారీగా తగ్గే వస్తువులు ఇవే!

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌లను పునర్నిర్మించాలని పరిశీలిస్తోంది. 12 శాతం GST ఉన్న కొన్ని ముఖ్యమైన వస్తువులపై పన్నును 5 శాతానికి తగ్గించడం లేదా 12 శాతం స్లాబ్‌ను పూర్తిగా రద్దు చేయడంపై చర్చ జరుగుతోంది. ఇది మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది.మధ్యతరగతి, దిగువ ఆదాయ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తూ గుడ్‌ న్యూస్‌ చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌ల పునర్నిర్మాణాన్ని తీవ్రంగా పరిశీలిస్తోందని సమాచారం. కొన్ని ముఖ్యమైన వస్తువులపై GSTని 12 శాతం నుండి 5 …

Read More »

డిగ్రీ అర్హతతో భారీగా ఐబీపీఎస్‌ బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్‌.. ఎంపికైతే లైఫ్‌ సెటిలంతే!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్‌).. 2026 – 27 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్స్‌, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు.. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 1వ తేదీ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.. …

Read More »

ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలకు మీరూ రాత పరీక్ష రాశారా? కీలక అప్‌డేట్స్ ఇవే..

ఇటీవల నిర్వహించిన లోకో పైలట్‌ 2024 సీబీటీ 2 (RRB ALP) పరీక్షల ఫలితాలు బుధవారం (జులై 2) విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో మార్చి 19, మే 2, 6వ తేదీల్లో నిర్వహించిన ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో..రైల్వేశాఖ ఆధ్వర్యలో ఇటీవల నిర్వహించిన లోకో పైలట్‌ 2024 సీబీటీ 2 (RRB ALP) పరీక్షల ఫలితాలు బుధవారం (జులై 2) విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక …

Read More »

ప్రమాదంపై ఎట్టకేలకు స్పందించిన సిగాచీ.. ఏం చెప్పిందంటే..?

కంపెనీలో జరిగిన ప్రమాదంపై సిగాచీ సంస్థ ఎట్టకేలకు స్పందించింది. ప్రమాదానికి సంబంధించిన ఒక లేక విడుదల చేసింది. ఈ ఘటనలో 40 మంది చనిపోగా.. 33మంది గాయపడినట్లు తెలిపింది. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు అన్నిరకాల బీమా క్లైమ్‌లను చెల్లిస్తామని చెప్పింది.35 ఏళ్లుగా కంపెనీని నడుపుతున్నామని.. ఎన్నడూ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది.సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనలో 40 మంది మరణించగా.. 33మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. …

Read More »