భారతీయ పిన్ కోడ్ వ్యవస్థ తపాలా సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. 6-అంకెల కోడ్ దేశాన్ని 9 జోన్లు, ఉప-జోన్లు, జిల్లాలు, పోస్టాఫీసులుగా విభజిస్తుంది. మొదటి అంకె జోన్‌ను, రెండవది ఉప-జోన్‌ను, మూడవది జిల్లాను, చివరి మూడు అంకెలు పోస్టాఫీసును సూచిస్తాయి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..నేటి డిజిటల్ యుగంలో ఉత్తరాలు పంపడం తగ్గిపోయినప్పటికీ, చిరునామాపై రాసే ‘పిన్ కోడ్’ ఇప్పటికీ మన రోజువారీ లావాదేవీలలో అంతర్భాగం. ఆన్‌లైన్ షాపింగ్ నుండి బ్యాంకింగ్ వరకు, ప్రభుత్వ పథకాల నుండి అత్యవసర సేవల వరకు, ప్రతిచోటా …
Read More »Blog Layout
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం- సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో గంజాయి మాట వినిపిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నామని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ ముందుకెళతామని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణను గత ప్రభత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని ఎవరైనా డ్రగ్స్‌తో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గురువారం గుంటూరులో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో …
Read More »కన్నప్పగా మంచు విష్ణు ఎంతవరకు మెప్పించారు..?
సినిమా చరిత్రలో కొన్నిటిని క్లాసిక్స్ గా చెప్పుకుంటాం. తరాలు మారినా తరగని ఆస్తులుగా పరిగణిస్తుంటాం. అలాంటి క్లాసిక్స్ నవతరాన్ని ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి. ఓ సారి ట్రై చేయమని కన్నుగీటుతూనే ఉంటాయి. అలా ఊరించిన సబ్జెక్టే కన్నప్ప. రెబల్‌స్టార్ కెరీర్‌లో కలికితురాయి ఈ మూవీ. అలాంటి సబ్జెక్టును యంగ్ రెబల్ స్టార్ వదులుకుంటారా? అనే ప్రశ్నలన్నటినీ దాటి.. ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్ మీద సరికొత్తగా ల్యాండ్ అయింది. ఇంతకీ మంచు విష్ణు మలిచిన ఈ కన్నప్ప కథ ఎలా ఉంది? ప్రభాస్ పాత్ర పొందిగ్గా కుదిరిందా? …
Read More »హైకోర్టులో జగన్‌కు ఊరట.. విచారణ వాయిదా.. తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన కోర్టు..!
గుంటూరు కారు ప్రమాదం కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు. సింగయ్య మృతి కేసును కొట్టేయాలంటూ వైఎస్ జగన్‌తోపాటు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినీ కూడా పిటిషన్లు …
Read More »మావోయిస్టు లేఖపై స్పందించిన మంత్రి సీతక్క..! ఒక మహిళ అని కూడా చూడకుండా..
తాజాగా మంత్రి సీతక్కపై వెలుగులోకి వచ్చిన మావోయిస్టు లేఖపై ఆమె స్పందించారు. ఇది నిజమైన బెదిరింపు లేక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అనేది తెలియాల్సి ఉందని అన్నారు. ఆదివాసి మహిళగా తనకు మంత్రి పదవి రావడం కొందరికి జీర్ణం కాలేదని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.మావోయిస్టుల పేరుతో ఇటీవలె మంత్రి సీతక్కపై ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ లేఖపై సీతక్క స్పందించారు. ఆ లేఖలో ములుగులో ఆదివాసీల గెంటివేతపై ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణలో ఆదివాసీల పరిరక్షణ బాధ్యత …
Read More »బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు
తెలంగాణలో బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి.. సల్లంగా చూడమని వేడుకుంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది కూడా బోనాల సంబురం మొదలు కాగా.. వచ్చే నెల 24న ముగుస్తాయి. బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర ప్రారంభం నేపథ్యంలో తొలి …
Read More »మావోల నుంచి బెదిరింపులు.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు భద్రత పెంపు!
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్‌రావుకు భద్రత పెంచాలని నిర్ణయించింది. మావోయిస్టుల నుంచి ఇటీవల రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన భద్రతపై పోలీస్ శాఖ ధృష్టి సారించింది. ఈ బెదిరింపు కాల్స్‌పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, ఆయనకు అదనపు భద్రత అవసమని నిర్ణయించారు. ఈ మేరకు రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాలని మెదన్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఇటీవల మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని …
Read More »ఎంతకు తెగించార్రా.. CID.. సుప్రీం కోర్టు.. చీఫ్ జస్టిస్.. అంతా ఫేక్! దారుణంగా మోసపోయిన ఉద్యోగి
కాప్రాకు చెందిన రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని, సైబర్ నేరస్థులు సుప్రీం కోర్టు, ఆర్బీఐ పేరుతో మోసం చేశారు. ఢిల్లీ పోలీసులమంటూ ఫోన్ కాల్ చేసి, మనీలాండరింగ్ కేసు నమోదైందని బెదిరించి, కోర్టు సెక్యూరిటీ పేరుతో రూ.22.05 లక్షలు గుట్టుచప్పుడు లేకుండా మోసం చేశారు. బాధితుడు తనకు తెలిసిన వారి సహాయంతో మోసం గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మోసం చేసేందుకు కేటుగాళ్లు ఏమైనా చేసేలా ఉన్నారు. ఏకంగా భారత దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా వాడేసుకున్నారు. గతంలో పోలీస్ యూనిఫామ్‌లో కొంతమంది ఫేక్ …
Read More »నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్‌కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!
హైదరాబాద్ మహానగరంలో ఓ కలెక్షన్ బాయ్ వ్యవహారం తన షాప్ యజమానికి హార్ట్ ఎటాక్ తెప్పించేంత పని అయ్యింది. తనని నమ్మి యజమాని పని అప్పచెపితే, తన అవసరం కోసం సోమ్ము చేసుకుని వాడుకున్నాడు. తీరా యజమాని పోలీసులను ఆశ్రయించడంతో కటకటాల పాలయ్యాడు. నమ్మిన బంగారు దుకాణం వ్యాపారికి టోకరా ఇచ్చిన ఉద్యోగి 7లక్షల రూపాయలతో కలెక్షన్ ఏజెంట్ పరార్ అయ్యాడు. నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతడి వద్ద నుండి రూ .6లక్షల 42 వేల …
Read More »ఫోన్ టాపింగ్ చేసే అధికారం ఎవరిది? టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెబుతోంది..?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతల వాంగ్మూలం తీసుకున్నా పోలీసులు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ టాపింగ్ గురించి చర్చ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది రాజకీయ నాయకులను మొదలుకుని జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను సైతం టాప్ చేశారంటూ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అసలు నిజంగానే ఇంతమంది ఫోన్లను టాప్ చేసే అధికారం ప్రత్యేక అధికారులకు ఉంటుందా..? ఎవరి అనుమతులు తీసుకొని ఇంత మంది ఫోన్లను …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal