Classic Layout

ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.. అక్కడ మోస్తరు వర్షాలు

ఏపీకి మరో వర్ష గండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ. మరి ఇంతకీ వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వాతావరణ సూచనలు ఇలా..భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయం బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దాని ప్రభావంతో సుమారు డిసెంబర్ 7వ తేది నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. …

Read More »

కాంగ్రెస్ ఎంపీ సీటు కింద రూ.500 నోట్ల కట్ట.. విచారణకు ఆదేశించిన రాజ్యసభ ఛైర్మన్

రాజ్యసభలో బయటపడ్డ 500 రూపాయల నోట్ల కట్ట. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధంఖర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ సభ్యుల బెంచ్‌పై కరెన్సీ నోట్ల గుట్టు రట్టు కావడంపై రాజ్యసభలో దుమారం మొదలైంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ ఈ సమాచారం ఇవ్వడంతో రాజకీయ రచ్చకు దారి తీసింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీకి సంబంధించిన సీటు నంబర్ 222 కింద రూ.500 నోట్ల కట్ట కనిపించింది. అదే సమయంలో …

Read More »

Women Schemes: మహిళల కోసం మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌.. వారి ఖాతాల్లో రూ.32 వేలు!

ఈ పథకం ద్వారా రూ. మహిళలు లేదా బాలికల పేరుతో 2 సంవత్సరాల కాలానికి 2 లక్షలు అందజేస్తున్నారు. దీనిపై అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకం పోస్టాఫీసుతో పాటు అనేక బ్యాంకుల్లో..మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ఒకటి ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ (MSSC). మహిళలను పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడింది. మహిళలు …

Read More »

ఇక బ్యాంకు ఖాతాకు 4 నామినీలు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

Nominee: కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఏర్పడిన సమస్యల తర్వాత బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లులో ఈ ప్రధాన మార్పులు చేశారు. ఇప్పుడు ఒక నామినీకి బదులుగా 4 నామినీలు యాడ్‌ చేసేందుకు అనుమతి ఉంటుంది.. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు డిసెంబర్ 3న లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ఒక బ్యాంకు ఖాతాలో 4 నామినీలను జోడించడానికి అందిస్తుంది. కొత్త బ్యాంకింగ్ చట్టం బిల్లులో డిపాజిటర్లకు మెరుగైన రక్షణ, ప్రైవేట్ బ్యాంకుల్లో మెరుగైన సేవలందించే అంశాలు కూడా ఉన్నాయి. క్లెయిమ్ చేయని షేర్లు, …

Read More »

అయ్యో దేవుడా.. ఆ తండ్రికి ఎందుకంత శిక్ష వేశావ్‌..? గుండె తరుక్కుపోయే ఘటన..

ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో పుట్టెడు దుఃఖంతో సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకొని బైక్‌పై తరలించినహృదయ విదారక ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. కురుపాం మండలం నీలకంఠాపురానికి చెందిన కొండగొర్రి అశోక్, స్వాతిలకు రెండు నెల క్రితం బాబు పుట్టాడు. ఆ బాబుకి రోహిత్ అని పేరు పెట్టారు. అలా మగ బిడ్డ పుట్టాడన్నా ఆనందంలో ఉండగానే అకస్మాత్తుగా రోహిత్‌కి అనారోగ్య సమస్య తలెత్తింది. ఈ క్రమంలోనే రోహిత్ ఆరోగ్యం మరింత …

Read More »

విశాఖలో యాసిడ్ దాడి అంటూ ప్రచారం.. జరిగింది ఇదేనట! కానీ ప్రశ్నలు మాత్రం ఎన్నో?

నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట.. ఇది మన పెద్దలు చెప్పేమాట. వారి కాలంలో ఏ పరిస్థితిని చూసి పెద్దలు ఈ సామెత చెప్పారో తెలియదు కానీ.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం. అసలు నిజం తెలియకముందే.. అబద్ధం ఊరంతా చుట్టి వచ్చింది. తీరా పోలీసులు అసలు వాస్తవాలు వెల్లడించిన తర్వాత.. అందరూ ఔరా అనుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలో బుధవారం జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. …

Read More »

బెండకాయను తింటే ఏమౌతుందో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండకాయలలోని పీచు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది డయాబెటిస్ నివారణకు మంచిది. బెండకాయల్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణని నెమ్మదిస్తుంది.మంచి ఆరోగ్యానికి పండ్లు, కూరగాయాలు మంచి పౌష్టికాహారం అని అందరికీ తెలిసిందే..! అయితే, కూరగాయల్లో ముఖ్యంగా బెండకాయ కూర, ఫ్రై అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. బెండకాయల్ని ఫ్రై, సాంబారు, పులుసు కూరల్లో ఎక్కువగా వాడతారు. అయితే, బెండకాయలు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయనేది మీకు తెలుసా..? బెండకాయ‌ …

Read More »

 దిశా ఎన్‌కౌంటర్‌కు 5 ఏండ్లు.. పాపం! వారికి ఇంకా తప్పని తిప్పలు..

తెలంగాణలో సంచలనం రేపిన దిశ ఘటన ఇప్పటికి ఎవరు ఇంకా మర్చిపోలేదు. 2019 నవంబర్ 27న అత్యంత దారుణంగా వెటర్నరీ డాక్టర్‌ను నిందితులు గ్యాంగ్ రేప్ చేశారు. సరిగ్గా పది రోజుల తర్వాత నిందితులను పోలీసులు ఇదే రోజున ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్‌ను సవాల్ చేస్తూ అనేక పిటిషన్లు అటు సుప్రీంకోర్టులను ఇటు హైకోర్టులోను ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో సిర్పుర్కర్‌ కమిషన్‌ను నియమించింది. సిర్పుర్కర్‌  కమిషన్ తన …

Read More »

ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా విద్యార్ధి బ్యాగ్‌.. ఏముందాని చెక్‌ చేయగా షాకింగ్ సీన్

ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఇంజనీరింగ్‌ విద్యార్ధి ఎయిర్‌ పోర్టులో అనుమానా స్పదంగా కనిపించాడు. అతడి లగేజీ చెక్‌ చేయగా.. రెండు బుల్లెట్లు బయటపడ్డాయి. ఈ ఘటన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో వెలుగు చూసింది. వెంటే సిబ్బంది సదరు విద్యార్ధిని అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు. గన్నవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని పానిపట్‌కు చెందిన ఆర్య యువకుడు గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్వస్థలం నుంచి గత జులై నెలలో యూనివర్సిటీకి …

Read More »

గ్రామ సమస్యలు తీర్చిన మహిళా సర్పంచ్‌కే పెద్ద కష్టం.. ఏకంగా ఇంట్లో నుంచి గెంటేసిన కుటుంబ సభ్యులు!

రోడ్డున పడ్డారు ఓ మహిళా సర్పంచ్. ఆమె గ్రామానికి ప్రధమ పౌరురాలు… గ్రామంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే ఆ మహిళా సర్పంచ్.. అయితేనేం.. ఓ మహిళగా సొంత కుటుంబ సభ్యుల నుంచి సమస్య ఎదురయింది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళా సర్పంచ్‌ను.. భర్త తరపు కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ అమానుష ఘటన శ్రీసత్య సాయి జిల్లాలో వెలుగు చూసింది. లేపాక్షి మండలం సిరివరం సర్పంచ్ నేత్రావతిని భర్త తరపు కుటుంబ సభ్యులే ఇంట్లో నుంచి …

Read More »