Kadam
July 14, 2025 క్రైమ్, తెలంగాణ
188
మహిళలకు బయటే కాదు.. ఆస్పత్రుల్లో కూడా రక్షణ లేకుండా పోయింది. బెడ్ మీద చికిత్స తీసుకుంటున్న రోగులను కూడా కామాందులు వదలడం లేదు. హైదరాబాద్‌లో నగరం నడిబొడ్డున ఉన్న ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది.పేషెంట్‌పై అత్యాచారయత్నం చేశారు వార్డ్ బాయ్. మహిళా అరుపులతో వెంటనే అప్రమత్తయ్యారు సిబ్బంది. విద్యానగర్‌లోని ఆంధ్రా మహిళా సభ ఆస్పత్రిలో చోటు చేసుకుంది ఈ దారుణం. మహిళా పేషెంట్‌పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాధితురాలి కేకలతో బంధువులు అప్రమత్తమయ్యారు. వార్డ్ బాయ్‌ని చితకబాదారు బాధితురాలి కుటుంబ సభ్యులు. అనంతరం …
Read More »
Kadam
July 14, 2025 ఆరోగ్యం, జాతీయం, తెలంగాణ
170
ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE) పరిశోధకులు పంజాబ్, తెలంగాణలో మూడు సంవత్సరాల ఉప్పు తగ్గింపు చొరవను ప్రారంభించారు. ICMR మద్దతుతో ఉన్న ఈ ప్రాజెక్ట్, సోడియం తీసుకోవడం తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కమ్యూనిటీ నేతృత్వంలోని ఆహార సలహా ప్రభావాన్ని పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నప్పటికీ, పట్టణ భారతీయులు రోజుకు 9.2 గ్రాములు వినియోగిస్తున్నారు. ఇది సూచించిన పరిమితి కంటే దాదాపు …
Read More »
Kadam
July 14, 2025 తెలంగాణ, భక్తి
174
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందన్నారు. నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తానని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. బోనాల జాతర కు సంతోషం గా సాకలు పోసి బాగా చేసారు. ప్రతి సారి …
Read More »
Kadam
July 14, 2025 అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్
203
కష్టపడి పనిచేసి మరి కొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటామనే సమయానికి వారిని మృత్యువు వెంటాడింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో దానిపై ఉన్న కూలీలు అంతా లారీ కింద పడ్జారు. వారిలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఇసుకపల్లి నుంచి మామిడికాయల లోడుతో రైల్వేకోడూరు మార్కెట్ యార్డుకు వెళుతున్న ఐచర్ వాహనం అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లి లోని చెరువు కట్ట వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న …
Read More »
Kadam
July 14, 2025 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
306
నియోజవర్గంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గొప్పగా బతికిన మా కుటుంబం ఇప్పుడు పేదరికంలో ఉందన్నారు. రాజకీయాల కారణంగా అప్పులపాలైపోయానని అన్నారు. తన కారును కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లిపోయారని.. ప్రస్తుతం తన అల్లుడి కారును వాడుతున్నానన్నారు. ‘‘గతంలో అష్టఐశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం.. ఈ రోజు చాలా పేదరికంలో ఉంది.. అప్పులపాలయ్యాం.. నా కారు కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. ప్రస్తుతం నా అల్లుడి కారు వాడుతున్నా’’.. అంటూ తూర్పు గోదావరి జిల్లా …
Read More »
Kadam
July 14, 2025 ఆంధ్రప్రదేశ్, నంద్యాల
179
శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు గమనించాల్సిన విషయం ఇది. జలాశయం నిండడంతో భక్తుల రద్దీ పెరగడంతో.. ఈ వారం మధ్యాహ్నం సమయంలో కల్పించే ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ప్రకటించింది. పరిస్థితిని భక్తులు అర్థం చేసుకోవాలని కోరింది . ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వచ్చేవారికి దేవస్థానం కీలక సూచన చేసింది. ఈ వారం (మంగళవారం నుండి శుక్రవారం వరకు) ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇటీవల శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో జలాశయం నిండుకుండలా …
Read More »
Kadam
July 14, 2025 ఆంధ్రప్రదేశ్, టెక్నాలజీ, తెలంగాణ
210
సాధారణంగా పట్టణాల్లో ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు ఈజీగా వాళ్లను పట్టుకుంటారు. కానీ రైళ్లలో దొంగతనాలు జరిగితే వాళ్లను పట్టుకొవడం రైల్వే పోలీసులకు సవాలుగా మారుతుంది. దీంతో ప్రయాణికులు పొగొట్టుకున్న వాటిని తిరిగి రికవరీ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ. అందుకే ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రైన్స్‌లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. వీటి సహాయంతో ట్రైన్లలో దోపిడీలకు పాల్పడే వారిని గుర్తించొచ్చని రైల్వేశాఖ భావిస్తోంది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో దోపిడీ దొంగల బీభత్సం. ప్రయాణికులను …
Read More »
Kadam
July 14, 2025 ఆంధ్రప్రదేశ్
162
బొబ్బిలి వీణకు మరో జాతీయ గౌరవం లభించింది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించిన గుర్తింపు ఈ కళకు నూతన ఊపిరిగా నిలవనుంది. రాజుల కాలం నుంచి తరతరాలుగా సాగుతున్న ఈ హస్తకళ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి వినిపించబోతోంది. చారిత్రక బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకం కింద బొబ్బిలి వీణ ఎంపిక అయ్యింది. ఈ అవార్డును విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ …
Read More »
Kadam
July 14, 2025 అమరావతి, ఆంధ్రప్రదేశ్
215
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు వేదికగా మారుతోంది. ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమరావతిలో బిట్స్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. రూ.2వేల కోట్ల పెట్టుబడితో, డిజిటల్ ఫస్ట్ ఆపరేషన్స్‌తో, ఏఐ, ఐఓటి ఇంటిగ్రేట్ క్యాంపస్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. 7000 మంది విద్యార్ధులు చదువుకునే విధంగా ఈ క్యాంపస్ నిర్మిస్తామని ఆయన …
Read More »
Kadam
July 14, 2025 ఆంధ్రప్రదేశ్, టెక్నాలజీ
209
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ టూర్ ఖరారైంది. ఈనెల 26 నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరనుంది. అమరావతి రాజధాని నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్‌కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 26 నుంచి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. సింగపూర్‌లోని రాజకీయ, వ్యాపార వర్గాలతో సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనపై చర్చలు …
Read More »