భారత ఆర్థిక వ్యవస్థ 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం 20.7 ట్రిలియన్ డాలర్లు చేరుకోవచ్చు. అధిక పొదుపు, పెట్టుబడులు, అనుకూల జనాభా వంటి అంశాలు దీనికి కారణం. 2038 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 34.2 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని, 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం పరంగా 20.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని …
Read More »TimeLine Layout
August, 2025
-
28 August
వరుణుడి ఉగ్రరూపం.. తండ్రీకొడుకులతో సహా వరదలో కొట్టుకుపోయిన కారు!
కామారెడ్డి జిల్లాపై వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. బుధవారం ఒక్కరోజే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. ఇక నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో జిల్లాలోని దోమకొండ మండలం సంగమేశ్వర్ ఎడ్లకట్ట వాగు సమీపంలో వరదలో చిక్కుకొని ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న తండ్రీకొడుకులు వాగులోని వరద నీటిలో కొట్టుకుపోయారు. దోమకొండకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మేక చిన్న హరిశంకర్, ఆయన కుమారుడు …
Read More » -
28 August
కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో పలు పరీక్షలు వాయిదా.. కారణం ఇదే!
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సర్కార్ సెలవులు …
Read More » -
28 August
రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం మామూలుగా లేదు.. గ్యాప్ లేకుండా దంచికొడుతున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడమే కాదు.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. రైల్వే ట్రాక్‌లు తెగిపోవడం.. వరదలకు కార్లు కొట్టుకుపోవడం.. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరుణ బీభత్సం కంటిన్యూ అవుతోంది. అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. ఇటు గుంటూరు, పల్నాడు, విజయవాడ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వాన వణికిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో …
Read More » -
28 August
భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?
వినాయకచవితి వచ్చిందటే చాలు వీధివీధినా రకరకాల గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి వీధిలో విభిన్న రకాల వినాయకులు కనువిందు చేస్తాయి. విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలు జనాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అయితే విజయనగరం జిల్లాలో నిర్మించిన డెబ్బై అడుగుల ఎత్తున ఈఫిల్ టవర్ వినాయక మండపం కూడా ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తుంది. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీలోని పొనుగుటివలస గ్రామం వినాయకచవితి ఉత్సవాలకు ప్రసిద్ధి. ఈ గ్రామస్తులు నిర్వహించే వినాయకచవితి ఉత్తరాంధ్రలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ …
Read More » -
28 August
దశాబ్దాలుగా వినాయచవితి పండగకు ఆ ఊరు దూరం.. కారణం ఏంటో తెలుసా?
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందుకు ఒక గణనాథుడి విగ్రహాన్ని పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. కానీ ఓ గ్రామం వినాయక చవితి పండుగకు దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పూర్వీకుల నుంచి ఆ గ్రామంలో అసలు వినాయకుడి పండుగ జరుపుకోలేదట. ఈ గ్రామంలో ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం విశేషం. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బసంపల్లి గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వినాయక చవితి పండుగను జరుపుకోవడం లేదు. తాత, ముత్తాతల నుంచి బసంపల్లిలో వినాయక …
Read More » -
28 August
నిరుద్యోగులకు అలర్ట్.. దక్షిణ రైల్వేలో 3518 ఉద్యోగాలు! రాత పరీక్షలేకుండానే ఎంపిక
దక్షిణ రైల్వే.. చెన్నైలోని రైల్వే రీజియన్లలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 3518 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్‌టీ, కార్పెంటర్, ఎంఎంవీ, ఎంఎంటీఎం, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మెన్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 26, 2025వ తేదీ …
Read More » -
28 August
ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు
ఆంధ్రప్రదేశ్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్.. మంగళగిరి, కడప, నెల్లూరు జిల్లాల్లోని జైళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 14 పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ఇవే.. ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ పోస్టుల సంఖ్య: 2 అకౌంటెంట్ కమ్ క్లర్క్ పోస్టుల సంఖ్య: …
Read More » -
26 August
లేడి డాన్ అరుణ పెద్ద కి’లేడీ’.. వామ్మో.! లిస్టు పెద్దదే ఉందిగా.. చూస్తే అవాక్
రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. లేడీ డాన్ అరుణ వ్యవహారంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అరుణ ఫోన్ డేటా ఆధారంగా బైట పడుతున్న సెటిల్మెంట్ దందాలు చూస్తుంటే ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు, పోలీసు ఉన్నతాధికారులు సన్నిహితంగా ఉంటున్న విషయాలు బయట పడుతున్నాయి. దీంతో గతంలో అరుణతో సన్నిహితంగా మెలిగిన రాజకీయ పార్టీల నేతలు, మాజీ ఎమ్మెల్యేల గుండెల్లో దడ మొదలైందట. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు బయట ఉన్న అరుణ హోం శాఖలోని కీలకంగా ఉన్న వారితో లాబీయింగ్ చేసి పెరోల్ తెప్పించిన …
Read More » -
26 August
600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలు.. ఖైరతాబాద్ గణేషుడి ఆగమనం మీరూ చూశారా.?
బుధవారం వినాయకచవితి పర్వదినం రోజున ఖైరతాబాద్ గణేషుడు కొలువు తీరనున్నాడు. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ ఉంటుంది. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ప్రాణ ప్రతిష్టకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సిద్ధాంతిలు కలశపూజ, ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. బుధవారం వినాయకచవితి పర్వదినం రోజున ఖైరతాబాద్ గణేషుడు కొలువు తీరనున్నాడు. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ ఉంటుంది. ఆ …
Read More »