తెలంగాణలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. దీంతో పలు జిల్లాల్లో అపారనష్టం జరిగింది. ఇళ్లు, పంటలు నీటమునిగాయి.. ఇప్పుడిప్పుడే ప్రభావిత ప్రాంతాలు కోలుకుంటున్నాయి.. ఈ తరుణంలో వరదలు, పంట నష్టంపై మరోసారి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలకు పరిహారంతో పాటు పలు అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం. వరద మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మృతి చెందిన పశువులకు కూడా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం …
Read More »TimeLine Layout
September, 2025
-
2 September
క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్.. కవితపై చర్యలకు సిద్ధమవుతోందా?
బీఆర్ఎస్‌లో తీవ్రమైన కుదుపులు. ఓ వైపు కాళేశ్వరంపై విచారణ పేరుతో బయటి నుంచి ఒత్తిడి పెంచే పరిణామాలు. మరోవైపు పార్టీలో కవిత నుంచి ఎదురవుతున్న ధిక్కార స్వరాలు. ఇంతకాలం కేసీఆర్‌కు కుటుంబమే బలం అనుకున్న పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఆ కుటుంబమే బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్న పరిస్థితి. కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్‌రావు. వీరంతా కేసీఆర్ కుటుంబసభ్యులు. కారు లాంటి బీఆర్ఎస్ పార్టీకి నాలుగు చక్రాల్లాంటివారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తరువాత అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎలాంటి కుదుపులు లేకుండా చూసేందుకు ఎవరి …
Read More » -
2 September
తెలంగాణలో సీబీఐకి రీ ఎంట్రీ.. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఇప్పుడేం జరగనుంది..?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ముమ్మాటికి అవినీతి జరిగింది..! పీసీ ఘోష్ కమిషన్ కూడా అదే తేల్చింది..! కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిందేనంటూ సీబీఐకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం.. ఇటు సీబీఐ విచారణకు కాషాయపార్టీ కూడా పచ్చజెండా ఊపింది. కాళేశ్వరం అవినీతికి పూర్తి బాధ్యత కారుపార్టీదేనని హస్తం నేతలతో కలసి కమలంపెద్దలు గట్టిగానే వాదిస్తున్నారు. ఇక అదంతా అటుంచితే… సీబీఐ ఎంట్రీపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాష్ట్రంలోకి నో ఎంట్రీ ఉన్న సీబీఐ ఎలా వస్తుంది..? వస్తే ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. …
Read More » -
2 September
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయకూడదుః హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసిన వేసింది హైకోర్టు. — హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వొకేట్ …
Read More » -
2 September
నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీలో 13,217 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసిందోచ్!
రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్‌ఆర్‌బీ)లో గ్రూప్ ఏ- ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) (ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పీఓ), గ్రూప్ బీ- ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ (ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్) పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-XIV) ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) గుడ్‌న్యూస్ చెప్పింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్‌ఆర్‌బీ)లో గ్రూప్ ఏ- ఆఫీసర్స్ …
Read More » -
2 September
మీరూ బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? టి-శాట్‌లో స్పెషల్ డిజిటల్ కంటెంట్ మీకోసమే..
ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్ కంటెంట్ అందించేందుకు టి-శాట్ నెట్‌వర్క్ ఛానళ్లు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రత్యేక డిజిటల్ కంటెంట్‌ను అందించనున్నట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే ఐబీపీఎస్ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న.. రాష్ట్ర నిరుద్యోగులకు టి-శాట్ నెట్‌వర్క్ ఛానల్ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్ కంటెంట్ అందించేందుకు టి-శాట్ నెట్‌వర్క్ ఛానళ్లు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రత్యేక డిజిటల్ కంటెంట్‌ను అందించనున్నట్లు …
Read More » -
2 September
బాబోయ్ మళ్లీ వానలు.. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! అతిభారీ వర్షాలు..
నిన్న, మొన్నటి వరకు వానలు నానాభీభత్సం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్న తరుణంలో IMD మరో బాంబ్ పేల్చింది. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలు.. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీర ప్రాంతం, వాయువ్య బంగాళాఖాతంలో సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు …
Read More » -
2 September
గీతా ఆర్ట్స్ వారి పవన్ బర్త్ డే స్పెషల్ మ్యాష్అప్.. ఎమోషనల్ డైలాగ్స్, స్పీచ్ తో సినీ. రాజకీయ జర్నీ.. చూస్తే గూస్ బంప్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటుడు-రాజకీయ నాయకుడైన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గీతా ఆర్ట్స్ స్పెషల్ విశేష్ తో రిలీజ్ చేసిన వీడియో పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్స్ తో .. అయన నేచర్ ని .. ఆలోచన తీరుని.. సిని ప్రముఖులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విషయాలను, రాజకీయ ప్రయాణం.. అన్నీ పొందుపరిచారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తన 54వ …
Read More » -
1 September
మోడీనా మజాకానా.. చైనాలోనూ మన ప్రధానే ప్రధాన ఆకర్షణ.. సోషల్ మీడియాలో ఫస్ట్ ప్లేస్ లో ట్రెండింగ్
ప్రధాని మోడీ రెండో రోజు చైనా పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు, అక్కడ మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ , రష్యా అధ్యక్షుడు పుతిన్‌లను కలిశారు. ఇప్పుడు ప్రధాని మోడీకి సంబంధించిన వార్తలు చైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పుతిన్ కారులో కూర్చున్న తర్వాత.. మోడీ చైనీస్ సెర్చ్ ఇంజన్ బైడు , చైనీస్ ‘ట్విట్టర్’ వీబోలో అగ్రస్థానంలో ట్రెండింగ్ అవుతున్నారు. ప్రధాని మోడీ ప్రజాదరణ కేవలం భారతదేశం లేదా అమెరికా-బ్రిటన్ దేశాలకే పరిమితం కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఆయన …
Read More » -
1 September
కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర.. వారిద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు.. కవిత సంచలన ఆరోపణలు..
కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే హరీశ్‌ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లు తెలిపారు. హరీశ్, సంతోష్ వల్లేనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయని అన్నారు. వాళ్ల స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారన్నారు. వారిద్దరి వెనక సీఎం రేవంత్ ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపడం దారుణమన్నారు. దమ్ముంటే హరీష్, సంతోష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాపై కుట్రలు చేసినా సహించా.. కానీ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నానని …
Read More »