మేష రాశి :
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఈరోజు వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరగడం వల్ల, మీకు మంచి ఫలితాలొస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు.
ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష్ స్తోత్రం’
వృషభ రాశి:
ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీ పిల్లల మంచి పనికి మీరు ప్రశంసలు కూడా పొందొచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈరోజు బయలుదేరితే, మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ వ్యాపారం కోసం మీ బంధువులలో ఒకరి నుండి సహాయం పొందొచ్చు. వస్తు సౌఖ్యాలు కూడా పెరుగుతాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు ధార్మిక ఆచారాలు చేయడం వల్ల మీ మనసుకు సంతృప్తి కలుగుతుంది.
ఈరోజు మీకు 97 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు రాత్రి కుక్కకు రోటీ తినిపించాలి.
మిధున రాశి :
ఈ రాశి వారికి ఈరోజు కోర్టుకు సంబంధించిన ఏవైనా కేసులుంటే, ఈరోజు మీకు అనుకూలంగా తీర్పు రాకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో ముఖ్యమైన పనులను వాయిదా వేయాలి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీ అధికారుల ఆశీర్వాదంతో మీ పని ప్రాంతం కూడా పెరుగుతుంది. ఈరోజు సాయంత్రం మీ స్నేహితులతో బయటకు వెళ్ళొచ్చు. కానీ యాత్రకు వెళ్లే ముందు అవసరమైన మెటీరియల్‌లను తనిఖీ చేయాలి. కుటుంబ సభ్యుల ప్రభావంతో మీరు ఈరోజు ఏదైనా వ్యాపార నిర్ణయం తీసుకుంటే, దాని వల్ల మీకు మంచి లాభాలొస్తాయి.
ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.
కర్కాటక రాశి:
ఉద్యోగులు ఈరోజు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినొచ్చు. ఉద్యోగులు ఈరోజు పైఅధికారులను ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే తగ్గుతుంది. మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం నుండి మీరు ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీ కుటుంబసభ్యులు మీ గురించి చెడుగా మాట్లాడొచ్చు. ఈరోజు మీరు వారి మాటల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు మీకు 63 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ కృష్ణుడిని పూజించాలి.
సింహ రాశి:
ఈ రాశి వారిలో వ్యాపారులు కొన్ని కొత్త లాభాలను పొందుతారు. ఉద్యోగులు ఈరోజు స్నేహితుని సహాయంతో ప్రయోజనం పొందుతారు. ఈరోజు సాయంత్రం మీరు కొన్ని సామాజిక కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అందులో మీరు కొంత ప్రత్యేక సమాచారాన్ని పొందొచ్చు. మీ కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఈ కారణంగా ఈరోజు కొంత ఆందోళన చెందుతారు. కానీ మీరు దానిని నియంత్రించడంలో కూడా విజయం సాధిస్తారు. ఈరోజు మీరు విదేశాల్లో ఉన్న బంధువుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు.
ఈరోజు మీకు 98 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
కన్య రాశి:
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ స్నేహితుడిని కలవడానికి వేచి ఉన్నట్లయితే, మీరు వారిని కలవొచ్చు. ఇది మీ హృదయాన్ని సంతోషపరుస్తుంది. మీరు ఈ సాయంత్రం ఏదైనా తినడం లేదా త్రాగడం మానుకోవాలి. లేకుంటే మీరు గ్యాస్, అజీర్ణ సమస్యలతో బాధపడొచ్చు.
ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పార్వతీ దేవిని పూజించాలి.
తులా రాశి:
ఈ రాశి వారు ఈరోజు తమ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేస్తే, మీ విజ్ఞత, విచక్షణతో మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే మీరు భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడొచ్చు. మీరు ఈరోజు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, దానిని కొంతకాలం వాయిదా వేయాలి. లేకుంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. మీ తండ్రికి ఏదైనా శారీరక అనారోగ్యం ఉంటే, ఈరోజు వారి బాధ పెరుగుతుంది. ఈ సమయంలో దయచేసి వైద్య సలహా తీసుకోవాలి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సాయంత్రం ప్రత్యేక సంభాషణలో గడుపుతారు.
ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు విష్ణువు జపమాలను 108 సార్లు జపించాలి.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు ఈరోజు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు. మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. అదృష్టం పరంగా ఈరోజు మంచి రోజు అవుతుంది. ఈరోజు, మీ జీవిత భాగస్వామి సలహాతో, మీ పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచిస్తారు. మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాలలో గడుపుతారు. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. పిల్లల పట్ల మీ ప్రేమ పెరుగుతుంది. ఈరోజు మీ ధైర్యంతో శత్రువులను ఓడించడంలో విజయం సాధిస్తారు.
ఈరోజు మీకు 66 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు బ్రాహ్మాణులకు దానం చేయాలి.
ధనస్సు రాశి :
ఈ రాశి వారు ఈరోజు చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. విద్యార్థులు ఏదైనా కోర్సులో చేరాలనుకుంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు ఈరోజు కొన్ని మంచి అవకాశాలను పొందొచ్చు. ఇది వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈరోజు మీరు మతపరమైన కార్యకలాపాలకు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఇది మీ కీర్తిని పెంచుతుంది.
ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి.
మకర రాశి:
ఈ రాశి వారికి ఈరోజు అనవసరమైన చింతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు ఈరోజు మీ పనిని పాడుచేయడానికి ప్రయత్నించొచ్చు. మరోవైపు మీరు ఏదైనా పార్ట్ టైమ్ వర్క్ చేయాలని ఆలోచిస్తే, అందుకోసం సమయాన్ని కేటాయిస్తారు. రాజకీయ రంగాల్లో ఉండే వారు మంచి విజయం సాధించడంతో చాలా సంతోషంగా ఉంటారు. మీకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మీ జీవిత భాగస్వామిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి
కుంభ రాశి:
ఈ రాశి వారు ఈరోజు వ్యాపారంలో ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతారు. ఈ కారణంగా మీరు కూడా కోపం తెచ్చుకుంటారు. అయితే మీరు ఓపికగా ఉండాలి. తొందరపడి ఏదైనా పని చేస్తే అది పాడైపోయి భారీ నష్టాలను చవిచూడాల్సి రావొచ్చు. ఈరోజు మీరు పిల్లల ఉద్యోగం లేదా వివాహం వంటి కొన్ని శుభ సంఘటనలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను పొందొచ్చు. ఈరోజు మీ భౌతిక సౌకర్యాలను పెంచుతారు. ఇది భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది.
ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి.
మీన రాశి :
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఈ సమయంలో బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈరోజు మీ పిల్లల సమస్యలను వింటూ సాయంత్రం ఎక్కువ సమయం గడుపుతారు.
ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శని దేవుడిని దర్శించుకుని తైలం సమర్పించాలి.