ఇది లక్కీ భాస్కర్ సినిమా స్టైల్‌ మించిన మోసం.. మాస్టర్‌ మైండ్‌తో భారీ స్కామ్..!

లక్కీ భాస్కర్ సినిమా గుర్తుంది కదూ. అందులో జరిగే మోసం తెలుసు కదా. సరిగ్గా అదే స్టైల్‌లో భారీ స్కామ్‌లు వెలుగు చూశాయి. చాలా మంది డబ్బును బ్యాంక్‌లో దాచుకుంటే చాలా సేఫ్ అని అనుకుంటారు. కానీ సిబ్బంది చేతివాటంతో బ్యాంకుల వైపు అనుమానంగా చూస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకుంటే.. గద్దలు వచ్చి ఎగురేసుకుని పోయినట్లుంది. ఇప్పుడదంతా ఎవరు తెచ్చిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి..?

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే బ్యాంకింగ్ రంగం ఇప్పుడు అంతర్గత మోసాలతో సవాళ్లను ఎదుర్కొంటోంది. హ్యాకర్ల నుంచి తమను తాము కాపాడుకోవడానికి బ్యాంకులకు కఠినమైన భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ, సొంత ఉద్యోగుల నుంచే వస్తున్న ప్రమాదం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంక్‌లో పొదుపు చేసుకుంటూ ఉంటారు. అయితే వ్యక్తిగత లాభాల కోసం బ్యాంక్ సిబ్బంది పాల్పడే మోసాలు కస్టమర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత ఏడాది కాలంగా వెలుగులోకి వస్తున్న స్కామ్‌లు వారిని మరింత టెన్షన్‌కి గురిచేస్తున్నాయి.

కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంటలోని కెనరా బ్యాంకులో జరిగిన స్కామ్‌తో 200 మంది ఖాతాదారులు రోడ్డున పడ్డారు. తమ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే సుమారు 3 కోట్లు విలువ చేసే బంగారం గోల్‌మాల్‌ కావడంతో… రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. రుణాలు మొత్తం చెల్లించినా బ్యాంకు అధికారులు తమ బంగారాన్ని తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయమైన బంగారం ఎక్కడ ఉంది? అంటూ ఆందోళన చేస్తున్నారు. అయితే ఇదే కాదు.. ఇటీవల ఇలాంటిదే మరో స్కామ్‌ మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో బయటపడింది. కస్టమర్లు లోన్ల కోసం కుదువపెట్టిన బంగారాన్ని బ్యాంక్‌ మేనేజర్‌, క్యాషియర్ కలిసి మాయం చేశారు. మొదట్లో మూడు, నాలుగు కోట్ల ఫ్రాడ్ జరిగి ఉంటుందని భావించారు. ఆ తర్వాత 12 కోట్ల 61లక్షల బంగారం.. కోటి 10 లక్షల నగదు మాయమైనట్టు తేలింది. బ్యాంక్ క్యాషియర్ ఇంత పెద్ద స్కామ్‌తో చేయడంతో బ్యాంకు సిబ్బందిని ఎంత వరకు నమ్మొచ్చన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

గతంలో పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బంది చేతిలో ఖాతాదారులు నిండా మునిగారు. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము అకౌంట్లలో లేదని తెలిసి షాక్‌ అయ్యారు. బ్యాంక్‌లో చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి కోట్లలో నగదు కొల్లగొట్టారు. బ్యాంకు ఖాతాదారుల నగదు, గోల్డ్​, ఎఫ్‌డీ సొమ్ము మాయం చేశారు. చాలా మంది డబ్బు, బంగారం బ్యాంక్‌లో దాచుకుంటే చాలా సేఫ్ అని అనుకుంటారు. అయితే ఈ స్కామ్‌లు చూసి బ్యాంకు సిబ్బందిని ఎంత వరకు నమ్మొచ్చని ప్రశ్నిస్తున్నారు ఖాతాదారులు. అధికారి, సిబ్బంది.. బ్యాంకు నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. పైసాపైసా కూడబెట్టుకుంటే… ఇప్పుడదంతా ఎవరు తెచ్చిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

About Kadam

Check Also

ఆ విశ్వవిద్యాలయం విధుల్లో కొత్త సెక్యూరిటీ గార్డు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. !

అది 2002 సంవత్సరం… ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కోతుల గుంపు తిరుగుతుండేది. చుట్టూ పక్కల అంతా వ్యవసాయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *