హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో..
హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 22, 2025వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ప్రకటన కింద మొత్తం 160 టెక్నికల్ ఆఫీసర్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో (ECE/ ETC/ E&I/ Electronics/ EEE/ Electrical/ CSE/IT/ Mechanical) బీఈ/బీటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే ప్రొడక్షన్/ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్/ రిపైర్/ మెయింటెనెన్స్/ మార్కెటింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కంట్రోల్స్ ఎక్విప్‌మెంట్/ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్/ ఆపరేషన్స్ ఆప్ ఈవీఎమ్స్ అండ్ VVPATలో ఏడాది పాటు పని అనుభవం ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 30 ఏళ్లు ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలాంటి రాత పరీక్షలేకుండా విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు మొదటి ఏడాది రూ.25,000, రెండో ఏడాది రూ.28,000, మూడు, నాలుగో ఏడాది రూ.31,000 చొప్పున జీతం చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.