బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణలో తొలి గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు నమోదు!

GBS Case: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (Guillain Barre Syndrome) కేసు నమోదైంది. ఓ మహిళకు జీబీఎస్‌ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మహిళా పేషెంట్ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..

దేశంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జీబీఎస్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. తెలంగాణలో తొలి జీబీఎస్‌ కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్‌ కిమ్స్ ఆస్పత్రిలో అందిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో జీబీఎస్‌ కారణంగా గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారి సహా ముగ్గురు మరణించారు. మరోవైపు.. మహారాష్ట్రలోని పుణెలోనూ దాదాపు 130 జీబీఎస్‌ అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయి.

దేశంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళన నెలకొంది. తెలంగాణలో తొలి జీబీఎస్‌ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తం అవుతున్నారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరల్‌ కారణంగా నరాలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది.

లక్షణాలు ఇవే:

ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి ఒళ్లంతా తిమ్మిరిగా ఉంటుందని, కండరాలు సైతం బలహీనంగా మారడంతో పాటు డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం తీసుకోవడం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్‌ వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, ఈ జీబీఎస్‌ అనేది అంటు వ్యాధి కాదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నయం చేసుకోవచ్చని చెబుతున్నారు. గులియన్-బారే సిండ్రోమ్ అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. కండరాల బలహీనత లేదా పక్షవాతం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది బలహీనత, పక్షవాతం లేదా నొప్పిని కలిగిస్తుంది.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *