హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను వివాదాలకు కేరాఫ్‌గా మార్చిన కారణాల్లో క్రికెట్ క్లబ్బులదీ కీలక పాత్రే. కొందరు బడాబాబులు క్లబ్బుల పేరుతో HCAలో తిష్టవేసుకుచి కూర్చున్నారు. అసలు ఈ క్లబ్బుల గోల ఏంటంటే.. హెచ్‌సీఏ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సింది తెలంగాణలో ఉన్న ఈ 217 క్లబ్బులే. ఒక్కో క్లబ్‌కి ఒక్కో ఓటు. అందుకే, హెచ్‌సీఏ రాజకీయం అంతా వీటి చుట్టూనే తిరుగుతుంటుంది.
HCA.. హైలెవెల్ కరప్టెడ్ అసోసియేషన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనగానే.. ‘దారితప్పిన, అవినీతిమయమైన సంఘం’ అనే ట్యాగ్‌లైన్ ఇస్తారు గానీ.. ఎంత ఖ్యాతి ఉండేదో తెలుసా ఒకప్పుడు. బీసీసీఐకి ఫౌండర్ మెంబర్ మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. 91 ఏళ్ల క్రితం ఏర్పడి, రిచెస్ట్ క్రికెట్ సంఘంగా ఓ రికార్డ్ మెయింటైన్ చేసింది. అసలు బీసీసీఐ పుట్టుకకు కారణమైన ఏడు క్రికెట్ అసోసియేషన్లలో హెచ్‌సీఏ కూడా ఒకటి. బట్.. ఇదంతా గతం. ఇక్కడంతా అవినీతి. బంధుప్రీతి. గోల్‌మాల్ గోవిందులే అంతా. ఏం.. దేశవ్యాప్తంగా యువ క్రికెటర్లు ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్నారు. టీమ్ ఇండియా తలుపు తడుతున్నారు. ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ నుంచి మాత్రం క్రికెట్ ప్రతిభ వెలుగులోకి రావట్లేదు. దానికి కారణం.. క్లబ్బులే.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను వివాదాలకు కేరాఫ్‌గా మార్చిన కారణాల్లో క్రికెట్ క్లబ్బులదీ కీలక పాత్రే. కొందరు బడాబాబులు క్లబ్బుల పేరుతో HCAలో తిష్టవేసుకుచి కూర్చున్నారు. అసలు ఈ క్లబ్బుల గోల ఏంటంటే.. హెచ్‌సీఏ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సింది తెలంగాణలో ఉన్న ఈ 217 క్లబ్బులే. ఒక్కో క్లబ్‌కి ఒక్కో ఓటు. అందుకే, హెచ్‌సీఏ రాజకీయం అంతా వీటి చుట్టూనే తిరుగుతుంటుంది. ఈ క్లబ్బులు చేయాల్సిందల్లా.. టాలెంట్ ఉన్న కుర్రాళ్లను వెతికి, టీమిండియాకు అందించడం. క్లుప్తంగా ఇదీ చేయాల్సింది. కాని, బీసీసీఐ నుంచి వచ్చే కాసుల కోసమే ‘ఉన్నామంటే ఉన్నాం’ అనిపించుకుంటాయివి.