గణేశ్ నిమజ్జనాలను కనులారా వీక్షించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రజలకు అసౌకర్య కలగకుండా రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన మొదటి రైలు ఉదయం 6గంటలకు మొదలుకుని అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైల్ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మహానగర వాసులకు శుభవార్త.. గణేశ్ నిమజ్జనాలను కనులారా వీక్షించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రజలకు అసౌకర్య కలగకుండా రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన మొదటి రైలు ఉదయం 6గంటలకు మొదలుకుని అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారు జామున 1 గంటకు చివరి రైల్ బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యంగా బడా గణపతి ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర నేపథ్యంలో ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందితోపాటు పోలీసులు, ప్రైవేటు సెక్యూరిటీతో పర్యవేక్షిస్తున్నామని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖైరతాబాద్కు వచ్చే మెట్రో ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించి మెట్రో భద్రతా సిబ్బందికి సహకరించాలనివిజ్ఞప్తి చేశారు. ఈ సేవలను భాగ్యనగర వాసులు వినియోగించుకోవాలని కోరారు.
మరోవైపు తెలంగాణ ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. ఇక దక్షిణ మధ్య రైల్వే నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఎంఎంటీఎస్ అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లుగా వెల్లడించింది. నిమజ్జనం రోజు నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ సర్వీసులకు నడిపిస్తామని అధికారులు తెలిపారు.