వేసవి సెలవుల తర్వాత జూన్ 12 నుంచి పాఠశాలలు తెరుచుకున్న తర్వాత అన్ని పాఠ్యాంశాలతో బిజీగా తరగతులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు పాఠశాలల విషయంలో ఓ డిమాండ్ మరింతగా పెరిగిపోతోంది. హైదరాబాద్‌లోని పాఠశాలలకు రెండవ శనివారం సెలవులు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ క్యాలెండర్‌లో రెండవ శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయని పేర్కొన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ అన్ని చోట్ల సెలవు ఇవ్వడం లేదు. దీంతో సెలవులు అమలు కచ్చితంగా జరగాలని డిమాండ్ ఉంది.
హైదరాబాద్ పాఠశాలల సెలవు డిమాండ్ వెనుక కారణాలు లేకపోలేదు. ఉపాధ్యాయులు రోజుకు 10 గంటల వరకు పనిచేస్తారని, అందుకే ఆదివారం సెలవులు సరిపోవని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో రెండో శనివారం కూడా పాఠశాలలకు సెలవు అవ్వాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. పాఠశాలలు పాఠశాల సమయం తర్వాత ఇంట్లో చేయడానికి మళ్లీ పరిపాలనా పనులను కూడా ఇస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రతినెల రెండో శనివారం సెలవు ఇచ్చినప్పటికీ హైదరాబాద్‌లోని పాఠశాలల్లో అదే ఎందుకు వర్తించడం లేదని అంటున్నారు. నగరంలో రెండో శనివారం సెలవు ఉండటం లేదని చెబుతున్నారు.
తెలంగాణ టుడేలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, హైదరాబాద్ , ఇతర జిల్లాల్లోని ప్రైవేట్ పాఠశాలలు పేర్కొన్న శనివారాల్లో సెలవులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్‌కు గురువారం ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని టీపీటీఎల్ఎఫ్ , ఎస్ఎఫ్ఐ , డీవైఎఫ్ఐ ప్రతినిధులు సమర్పించారు. కాగా ప్రభుత్వం ఈ అంశంపై స్పందించాల్సి ఉంది.