పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

హైదరాబాద్‌లో ఇటీవల సోషల్ మీడియాలో ‘ట్రాఫిక్ చలాన్ల పై భారీ డిస్కౌంట్’ అనే పేరు మీద ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ ఫేక్ వార్త ప్రకారం, ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్లు వైరల్ చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా ఫేక్ వార్తగా తేల్చేసారు. గతంలో ఈ తరహాలో డిస్కౌంట్‌లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈసారి వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

వైరల్ అవుతున్న ఫేక్ వార్త ఇదే:-

టూ-వీలర్స్: 80% డిస్కౌంట్. ఉదాహరణకు, ₹700 ఫైన్ ఉంటే, కేవలం ₹140 చెల్లిస్తే చాలు

కార్లు (ప్రైవేట్): 60% డిస్కౌంట్. ఉదాహరణకు, ₹2000 ఫైన్ ఉంటే, కేవలం ₹800 చెల్లిస్తే చాలు

ఆఫర్ డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఫేక్ వార్తను క్రియేట్ చేసారు. ఈ వార్తను చూసి చాలామంది ఈ ఆఫర్ నిజమని అనుకుని, చలాన్లు క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ తెలంగాణ పోలీస్ విభాగం దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ విషయం పై పోలీసులు క్లారిటీ ఇచ్చేసారు. చలాన్లపై డిస్కౌంట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని పోలీసులు స్పష్టం చేసారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న డిస్కౌంట్ ఆఫర్ పూర్తిగా తప్పుడు సమాచారం. ఈ తరహా సమాచారం నమ్మకూడదు.

అలాగే ఎవరైనా ఈ తరహా ఫేక్ వార్తలు షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేయడానికై అధికారిక వెబ్‌సైట్ అయిన echallan.tspolice.gov.in ను మాత్రమే ఉపయోగించండి. ఈ విధమైన తప్పుడు సమాచారాన్ని నమ్మి, మీకు లాభం కలిగిందని భావించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ ఫేక్ వార్తలో పోలీస్ లోగో, అధికారిక స్టాంపులు వంటి వాటిని ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. ‘FAKE’ అని Telangana State Police స్పష్టంగా వాటిపై ముద్రించినట్లు ఉన్నా, ఇప్పటికీ ఇది చాలామందిని కన్‌ఫ్యూజ్ చేస్తోందని తెలంగాణ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

About Kadam

Check Also

అనుమతులు ఉన్నా.. లేకున్నా వాటి జోలికి వెళ్లం.. హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

హైడ్రా ఓవరాల్ ప్రోగ్రెస్‌పై కమిషనర్ రంగనాథ్ స్పందించారు.. ఇప్పటివరకు 8చెరువులు, 12 పార్కులను హైడ్రా కాపాడిందని తెలిపారు. దీంతోపాటు 200 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *