ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన యువతి.. ఆపి లగేజ్‌ చెక్‌ చేయగా..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న మహిళను అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి సుమారు రూ.3 కోట్లు విలువైన 3.1 కేజీల గంజాయ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకాక్ నుండి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల మహిళను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. అమె నుంచి సుమారు 3.1 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.3 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్‌ నుంచి ఇండిగో విమానం 6E-1068లో హైదరాబాద్‌ చెందిన 23 ఏళ్ల మహిళ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఫ్లైట్‌ దిగి వస్తున్న క్రమంలో ఆమె ప్రవర్తన అనుమానంగా ఉండడం గమనించిన ఇమిగ్రేషన్ అధికారులు వెంటనే ఆమెను అడ్డగించారు. ఆమె లగేజ్‌ను చేక్‌ చేయగా ఆ బ్యాగ్‌లో ఆమె నాలుగు హైడ్రోపోనిక్ గంజాయి ప్యాకెట్లను దాచి ఉంచినట్టు గుర్తించారు. వెంటనే మహిళను అదుపులోకి తీసుకొని.. ఆమె బ్యాగ్‌లోని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన మొత్తం గంజాయి సుమారు 3.1 కేజీలు ఉన్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ గంజాయి విలువు సుమారు రూ.3 కోట్ల వరకు ఉండోచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తదుపరి విచారణ కోసం మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు.

About Kadam

Check Also

నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది.. రామన్న వారితో జాగ్రత్త.. కవిత సంచలన వ్యాఖ్యలు..

నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది.. నేను కూడా మీలాగే ముఖం మీద మాట్లాడుతా.. అంటూ కేసీఆర్ కూతురు కవిత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *