చెరువును ఆక్రమించి కట్టిన కాలేజీ భవనాలను కూల్చివేయకపోవడంపై హైడ్రా స్పష్టం చేసింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడంలో వెనకా ముందు ఆలోచించాల్సి వస్తుందని క్లారిటీ ఇచ్చింది. అయితే, ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినచర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చింది. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెరువులను రక్షించడానికి.. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి హైడ్రాను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి ఆక్రమణదారుల పనిపడుతోంది ప్రభుత్వం. హైడ్రా .. ప్రభుత్వ భూములను కాపాడే సుదర్శన చక్రం అంటూ సీఎం రేవంత్ రెడ్డి అనేకసార్లు ప్రశంసించారు. హైడ్రా చర్యలతో కొందరు తమ తప్పులు తెలుసుకుని స్వచ్ఛదంగా ప్రభుత్వ భూమిని అప్పగించారన్నారు.
మరోవైపు హైడ్రాపై మండిపడుతున్నారు బీఆర్ఎస్, బీజేపీ నేతలు. హైడ్రాను ఒక భూతంతో పోలుస్తున్నారు. వందల ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకుని ఉంటున్నవారిని రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.విపక్ష నేతలే కాదు సొంత పార్టీ నేతల నుంచి కూడా హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా తీరును ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, దానం నాగేందర్ పలుమార్లు తప్పుబట్టారు. అరికెపూడి గాంధీ అయితే హైడ్రా అధికారులను అడ్డుకున్నారు. సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్నారు. సున్నం చెరువు FTL, బఫర్ జోన్లకు సంబంధించి హైడ్రా అధికారులు బౌండరీలు మార్చారని గాంధీ ఆరోపించారు. హైడ్రా అధికారుల తీరుపై కమిషనర్ రంగనాథ్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానన్నారు గాంధీ. మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైడ్రా పనితీరును సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో సలకం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అక్బురుద్దీన్ కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హైడ్రా క్లారిటీ ఇచ్చింది.
చెరువును ఆక్రమించి కట్టిన కాలేజీ భవనాలను కూల్చివేయకపోవడంపై హైడ్రా స్పష్టం చేసింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడంలో వెనకా ముందు ఆలోచించాల్సి వస్తుందని క్లారిటీ ఇచ్చింది. అయితే, ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినచర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చింది. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నట్టు వెల్లడించింది. కాలేజీ ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించినందున గత సెప్టెంబర్‌లో తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పాం. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోంది. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారు. పేద ముస్లిం మహిళలకు వెనుకబాటు తనం నుంచి విముక్తి కల్పిస్తున్నారని హైడ్రా పేర్కొంది.
పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడం లేదు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశాం. 25 ఎకరాల సరస్సును ఫ్లాట్ గా మార్చిన ఒవైసీ కుటుంబానికి సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చేశామని హైడ్రా వివరించింది. సామాజిక కారణాల వల్లనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశామని చెప్పుకొచ్చింది.