ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్).. 2026 – 27 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు.. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జులై 1వ తేదీ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
పోస్టులు భర్తీ చేసే బ్యాంకులు ఇవే..
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- బ్యాంక్ ఆఫ్ ఇండియా
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- కెనరా బ్యాంక్
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఇండియన్ బ్యాంక్
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
- యూసీవో బ్యాంక్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఐబీపీఎస్ ప్రొబేషన్‌రీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు జూలై 21, 2025 నాటికి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయో పరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి 20 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. అంటే జులై 2, 1995 నుంచి జులై 1, 2005 మధ్య జన్మించినవారు మాత్రమే అర్హులన్నమాట. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు జులై 21, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.175 తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, వ్యక్తిత్వ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్‌లో మెయిన్స్ (80 శాతం), ఇంటర్వ్యూకు (20 శాతం) మార్కులు ఉంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూలై, 2025.
- ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 21, 2025.
- ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు 2025.
- మెయిన్స్ పరీక్ష తేదీ: అక్టోబర్ 2025.
- ఇంటర్వ్యూ: డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026
- తాత్కాలిక అలాట్మెంట్లు: జనవరి నుంచి ఫిబ్రవరి 2026 మధ్యలో