నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీలో 13,217 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసిందోచ్!

రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్‌ఆర్‌బీ)లో గ్రూప్ ఏ- ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) (ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పీఓ), గ్రూప్ బీ- ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ (ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్) పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-XIV) ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) గుడ్‌న్యూస్‌ చెప్పింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్‌ఆర్‌బీ)లో గ్రూప్ ఏ- ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) (ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పీఓ), గ్రూప్ బీ- ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ (ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్) పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-XIV) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 13,217 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇలా..

  • ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్) పోస్టుల సంఖ్య: 7,972
  • ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల సంఖ్య: 3907
  • ఆఫీస్‌ స్కేల్-II (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) పోస్టుల సంఖ్య: 50
  • ఆఫీస్‌ స్కేల్-II (లా) పోస్టుల సంఖ్య: 48
  • ఆఫీస్‌ స్కేల్-II (సీఏ) పోస్టుల సంఖ్య: 69
  • ఆఫీస్‌ స్కేల్-II (ఐటీ) పోస్టుల సంఖ్య: 87
  • ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) పోస్టుల సంఖ్య: 854
  • ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) పోస్టుల సంఖ్య: 15
  • ఆఫీసర్ స్కేల్ II (ట్రేజరీ మేనేజర్‌) పోస్టుల సంఖ్య: 16
  • ఆఫీసర్ స్కేల్ III పోస్టుల సంఖ్య: 199

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) పోస్టులు, ఆఫీసర్ స్కేల్ II స్పెషలిస్ట్‌ ఆఫీసర్, ఆఫీసర్ స్కేల్ III సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. స్థానిక భాషాలో ప్రావీణ్యం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్ధుల వయో పరిమితి.. ఆఫీస్ అసిస్టెంట్‌ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ II పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ III పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 21, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈఎస్‌ఎం/డీఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.175 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇక ఆఫీసర్ స్కేల్ II, III పోస్టులకు సింగిల్ ఆన్‌లైన్ పరీక్షతోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది.

About Kadam

Check Also

నేటి నుంచి మెగా డీఎస్సీ రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. మీకు కాల్ లెటర్‌ వచ్చిందా?

మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ కొలువులకు ఇటీవల ఫలితాలు వెలువరించిన సంగతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *