వాయిదా వేసిన సీఏ పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్‌.. మే 16 నుంచి పునఃప్రారంభం

దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల మే 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తాజాగా ప్రకటించింది. తాజాగా దేశంలో భద్రతా పరిస్థితులకు సంబంధించి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో..

ఇండియా- పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల మే 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఈ పరీక్షలు మే 9 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. తాజాగా దేశంలో భద్రతా పరిస్థితులకు సంబంధించి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ICAI తెలిపింది. దీంతో సీఐ ఫైనల్, ఇంటర్మీడియట్, ఐఎన్‌టీటీ-ఏటీ (పీక్యూసీ) పరీక్షలను మే 16 నుంచి 24 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఐసీఏఐ తన ప్రకటనలో తెలిపింది.

కొత్త షెడ్యూల్ ఇదే..

  • మే 10 (శనివారం)న జరగాల్సిన తుది పరీక్ష (గ్రూప్ II) పేపర్ – 5 మే 16 (శుక్రవారం)కి మార్చారు.
  • మే 13 (మంగళవారం) జరగాల్సిన ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్స్, ఇంటర్నేషనల్ టాక్సేషన్ – అసెస్‌మెంట్ టెస్ట్ (INTT–AT) పేపర్ – 2, ఇంటర్నేషనల్ టాక్స్ – ప్రాక్టీస్‌లను కవర్ చేసే ఫైనల్ ఎగ్జామినేషన్ (గ్రూప్ II) పేపర్ – 6లు పరీక్ష మే 18 (ఆదివారం)న నిర్వహించబడుతుంది.
  • మే 9 (శుక్రవారం)న జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు (గ్రూప్ II), పేపర్ – 4, కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ పరీక్ష మే 20 (మంగళవారం)కి మార్చారు.
  • మే 11 (ఆదివారం)న జరగాల్సిన పేపర్ – 5, ఆడిటింగ్ & ఎథిక్స్ పరీక్ష మే 22 (గురువారం)న జరుగుతుంది.
  • మే 14వ తేదీ (బుధవారం) జరగాల్సిన పేపర్ – 6, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ & స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ పరీక్ష మే 24వ తేదీ (శనివారం)కి మార్చారు.

రీషెడ్యూల్ చేయబడిన పరీక్షలు అవే పరీక్షా కేంద్రాలలో, అదే సమయాలలో అంటే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే జారీ చేయబడిన అడ్మిట్ కార్డులు రీషెడ్యూల్ చేయబడిన తేదీలకు చెల్లుబాటులో ఉంటాయి.

About Kadam

Check Also

దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్‌ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..

ఇక్కడ 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *