మహిళల ప్రపంచ కప్ 2025 కోసం రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించారు. ఐసీసీ చీఫ్ జై షా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైజ్ మనీని ఏకంగా 297 శాతం పెంచి $13.88 మిలియన్లకు పెంచారు.
మహిళల ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం, ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ మనీని 297 శాతం పెంచింది. ఐసీసీ చీఫ్ జై షా మహిళల ప్రపంచ కప్ బహుమతి డబ్బును 13.88 మిలియన్ డాలర్లు అంటే రూ. 122 కోట్లకు పైగా నిర్ణయించారు. ఐసీసీ చీఫ్ అయిన వెంటనే, జై షా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మహిళల క్రికెట్‌ను వేరే స్థాయికి తీసుకెళ్లడానికి ఈ చర్య తీసుకున్నాడు. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు ఎంత డబ్బు వస్తుందో ఇప్పుడు మీకు తెలియజేద్దాం. ఈసారి ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టుపై డబ్బుల వర్షం కురవనుంది.
మహిళల ప్రపంచ కప్ ప్రైజ్ మనీ..
మహిళల ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు ఐసీసీ 4.48 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. అంటే, ఈ మొత్తం భారత కరెన్సీలో దాదాపు 40 కోట్ల రూపాయలు. ఫైనల్‌లో ఓడిన జట్టు, అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు బహుమతిగా లభిస్తుంది. సెమీఫైనల్స్‌కు చేరిన జట్టుకు దాదాపు 10 కోట్ల రూపాయలు అందుతాయి. గ్రూప్ దశలో మ్యాచ్ గెలిచిన జట్టుకు 34 వేల డాలర్లు. ఐదవ, ఆరవ స్థానంలో నిలిచిన జట్టుకు 6 కోట్ల రూపాయలు. ఏడవ, ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్టుకు 2.5 కోట్ల రూపాయలు అందుతాయి. ఒక జట్టు మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా, ప్రతి జట్టుకు కనీసం 2 కోట్లు, 50 లక్షల రూపాయలు అందుతాయి.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ షెడ్యూల్..
సెప్టెంబర్ 30, మంగళవారం: భారత్ vs శ్రీలంక
అక్టోబర్ 1, బుధవారం: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్
అక్టోబర్ 2, గురువారం: బంగ్లాదేశ్ vs పాకిస్తాన్
అక్టోబర్ 3, శుక్రవారం: ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా
అక్టోబర్ 4, శనివారం: శ్రీలంక vs ఆస్ట్రేలియా
అక్టోబర్ 5, ఆదివారం: ఇండియా vs పాకిస్తాన్
అక్టోబర్ 6, సోమవారం: న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా
అక్టోబర్ 7, మంగళవారం: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్
అక్టోబర్ 8, బుధవారం: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్
అక్టోబర్ 9, గురువారం: భారత్ vs దక్షిణాఫ్రికా
అక్టోబర్ 10, శుక్రవారం: న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్
అక్టోబర్ 11, శనివారం: ఇంగ్లాండ్ vs శ్రీలంక
అక్టోబర్ 12, ఆదివారం: ఇండియా vs ఆస్ట్రేలియా
అక్టోబర్ 13, సోమవారం: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్
అక్టోబర్ 14, మంగళవారం: శ్రీలంక vs న్యూజిలాండ్
అక్టోబర్ 15, బుధవారం: ఇంగ్లాండ్ vs పాకిస్తాన్
అక్టోబర్ 16, గురువారం: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్
అక్టోబర్ 17, శుక్రవారం: శ్రీలంక vs దక్షిణాఫ్రికా
అక్టోబర్ 18, శనివారం: న్యూజిలాండ్ vs పాకిస్తాన్
అక్టోబర్ 19, ఆదివారం: ఇండియా vs ఇంగ్లాండ్
అక్టోబర్ 20, సోమవారం: శ్రీలంక vs బంగ్లాదేశ్
అక్టోబర్ 21, మంగళవారం: దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్
అక్టోబర్ 22, బుధవారం: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్
అక్టోబర్ 23, గురువారం: ఇండియా vs న్యూజిలాండ్
అక్టోబర్ 24, శుక్రవారం: శ్రీలంక vs పాకిస్తాన్
అక్టోబర్ 25, శనివారం: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా
అక్టోబర్ 26, ఆదివారం: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్
అక్టోబర్ 26, ఆదివారం: భారత్ vs బంగ్లాదేశ్
అక్టోబర్ 29, బుధవారం: మొదటి సెమీ-ఫైనల్
అక్టోబర్ 30, గురువారం: రెండవ సెమీ-ఫైనల్
నవంబర్ 2, ఆదివారం: TBC vs TBC, ఫైనల్.