టెన్త్, ఇంటర్ అర్హతతో ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు! ఇలా దరఖాస్తు చేసుకోండి..

న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్‌ సర్వీసెస్‌.. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లలో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్‌ సర్వీసెస్‌.. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లలో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేసణ్‌ కింద మొత్తం 1,446 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులు 1,017, లోడర్ పోస్టులకు (పురుషులు మాత్రమే) 429 వరకు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధనంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. లోడర్‌ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు పురుషులు, మహిళలు ఇద్దరూ అర్హులే. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేయవచ్చు. వీరికి ఏవియేషన్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఐటీఐ విద్యార్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఇక లోడర్ పోస్టులకు టెన్త్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. కేవలం పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అర్హత కలిగిన వారు రెండు పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు పరిమితి.. ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు, లోడర్ పోస్టులకు 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయస్సులో ఎలాంటి రిలాక్సేషన్ ఉండదు.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్ 21, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద గ్రౌండ్ స్టాఫ్‌కు రూ.350, లోడర్ రూ.250 చెల్లించాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష అబ్జెక్టివ్‌ విధానంలో హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు రాత పరీక్ష తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది.లోడర్ పోస్టు కి కేవలం రాత పరీక్ష మాత్రమే ఉంటుంది. ఎంపికైన వారికి ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు, లోడర్ పోస్టులకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థులు www.igiaviationdelhi.com వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి.

About Kadam

Check Also

దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్‌ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..

ఇక్కడ 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *