బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం భారీ వర్షసూచన చేసింది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ కేంద్రం..
తూర్పు దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో సముద్రమత్తానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు (సెప్టెంబర్ 9) తెలంగాణ లోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రేపు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
ఏపీకి భారీ వర్ష సూచన
మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం భారీ వర్షసూచన చేసింది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో రాబోయే 3 గంటల్లో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.