బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. బికనేర్ నుంచి అల్పపీడనం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో..
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. బికనేర్ నుంచి అల్పపీడనం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు జగన్నాధ కుమార్, విశాఖ తుఫాను కేంద్రాలు హెచ్చరికలు జారీ చేశాయి.
మరోవైపు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, కొబరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వచ్చే 2, 3 గంటల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ సూచించింది. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రైతులు భద్రంగా ఉండాలని, తమ పంటను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. వర్షం సమయంలో చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిలబడరాదని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.