మూడు రోజులపాటు భారీ వర్షాలు.. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్!

రాష్ట్రంలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురవునున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం (జులై 18) ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. శనివారం (జులై 19) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురవునున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం (జులై 18) ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. శనివారం (జులై 19) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఆదివారం (జులై 20) కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగుల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న గురువారం సాయంత్రం 7 గంటల నాటికి ఎన్టీఆర్ జిల్లా ఉటుకూరులో 69.2మిమీ, గుంటూరు జిల్లా బేతపూడిలో51.5మిమీ, బాపట్ల జిల్లా పర్చూర్ లో 50.25మిమీ, ఎన్టీఆర్ జిల్లా చీమలపాడులో 44.7మిమీ, కోనసీమ జిల్లా నగరంలో 43మిమీ, కృష్ణా జిల్లా బోడగుంటలో 42.5మిమీ చొప్పున వర్షపాతం నమోదు..

తెలంగాణలో వాతావరణ ఎలా ఉంటుందంటే..

తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలలో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని అన్ని జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *