ఈదురుగాలులు బాబోయ్‌.. జరభద్రం! నేడు, రేపు వానలే వానలు..

ఆగ్నేయ దిక్కులో ఈశాన్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని అల్పపీడనం వరకు సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఈ రోజు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే నేడు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీలో నేటి వాతావరణం ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్ గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని గంగానది దాని పరిసర ప్రాంతాల మీదుగా విస్తరించి ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ నుండి 7.6 కి.మీ. ఎత్తు మధ్యలో విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయ నగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకా పల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి, అనంతపురం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న (జులై 8) కర్నూలు జిల్లా ఆధోనిలో 37 మి.మీ, కౌతాళంలో 23.5, అనంతపురంలో 22, అల్లూరి సీతారామరాజు జిల్లా రేఖపల్లిలో 18.25 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *