నేడు వడగండ్ల వానలు, ఈదురు గాలులు.. ఆరంజ్ అలెర్ట్ జారీ!

తెలుగు రాషాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవేసు ద్రోణి ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తుంటే.. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని..

ఉత్తర చత్తీస్‌ఘడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మున్నార్ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో మంగళవారం (ఏప్రిల్‌ 22) తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 43.8, కనిష్టంగా భద్రాచలం లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రామగుండం, ఖమ్మం, మహబూబ్ నగర్, హనుమకొండ, నల్లగొండ, భద్రాచలంలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

  • ఆదిలాబాద్.. 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • నిజామాబాద్.. 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • మెదక్.. 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • రామగుండం.. 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • ఖమ్మం.. 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • మహబూబ్ నగర్.. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • హనుమకొండ.. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • నల్లగొండ.. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • భద్రాచలం.. 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • హైదరాబాద్.. 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు

అధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో ఈ రోజు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ 21 జిల్లాలలో అత్యధికంగా 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉంది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీలో నేడు, రేపు వడగాడ్పులు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ మంగళ, బుధ వారాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండ తీవ్రత, వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ కేంద్రం హెచ్చరించింది. నేడు మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లోని 28 మండలాల్లో తీవ్రంగా శ్రీకా కుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 21 మండ లాల్లో మోస్తరు పడగాడ్పులు వీస్తాయని హెచ్చరిక జారీ చేసింది. అక్కడక్కడ ఆకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్న సోమవారం తిరుపతి రూరర్‌లో 42.1°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంట, విజయనగరంలో 41.5°C, నెల్లూరు జిల్లా దగదర్తిలో 41.4°C, ఏలూరు జిల్లా దెందలూరులో 41.3°C, నంద్యాల జిల్లా గోనవరం, పల్నాడు జిల్లా రావిపాడులో 41.1°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి.

విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలపై నేడు హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించనున్నారు. వడగాల్పులు, తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉదయం 11 కు హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించనున్నారు. వడగాల్పులకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసి రక్షించుకోవడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడం, రాబోయే వర్షాకాలనికి సంసిద్ధత వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *