రోజులు మారాయి గురూ.. ఆ స్కూల్‌లలో దర్శనమిస్తున్న నో అడ్మిషన్ బోర్డ్స్‌!

ప్రభుత్వ స్కూల్స్‌ అనగానే.. ఏ అక్కడ క్వాలిటీ స్టడీ ఉండదు.. ఎందుకు అక్కడ చేర్చడం అని అనుకునే వారు ఇప్పుడు తమ మైండ్‌ సెట్‌ను మార్చుకోవాల్సిందే అంటున్నారు అధికారులు. ఎందుకంటే ఇప్పుడు ఆరోజులు మారాయి.. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ చొరవ, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి, పదో తరగతిలో విద్యార్థులు సాధిస్తున్న ఉత్తమ ఫలితాలే ఇందుకు నిదర్శనం.

ఎటువంటి ఫీజు తీసుకోకుండా విద్య.. పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్, మధ్యాహ్న భోజనం వంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా.. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్‌లకు పంపేవారు కాదు. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్‌లలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండు.. అక్కడికి పంపిస్తే పిల్లలకు సరిగ్గా చదవు రాదు అనే అభిప్రాయం చాలా మందిలో తల్లిదండ్రులలో ఉండేది. అందుకే పేద, మధ్యతరగతి వారు సైతం అప్పు చేసైనా సరే పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చేవారు. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే ఈ అకడమిక్ ఇయర్ (2025–26)లో ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య 2.50 లక్షలు దాటినట్లు అధికారులు తెలిపారు. కొన్ని పాఠశాలల్లో అయితే ఏకంగా నో అడ్మిషన్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి.

తెలంగాణలో ఈసారి ప్రభుత్వ స్కూల్స్ వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఈసారి చేరిన వారిలో సుమారు 50,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకి మారడాన్నీ ప్రత్యేకంగా చూడాలి. విద్యార్థులలో ఈ మార్పు రావడానికి ప్రధాన కారణం… ప్రభుత్వ స్కూల్‌లపై గత కొన్నేళ్లుగా ప్రభుత్వం చొరవ, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి, పదో తరగతిలో విద్యార్థులు సాధిస్తున్న ఉత్తమ ఫలితాలు.. ఇకే ఈ మార్పుకు కారణమంటున్నారు అధికారులు. ఈ వ్యవస్థ ఇలానే కొనసాగితే ఇక ప్రైవేటు స్కూల్స్‌ అవసరమే లేదంటున్నారు.

పదో తరగతిలో సర్కార్ బడి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడమే కాకుండా.. ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచేలా కొత్త కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా జూన్ 6 నుంచి 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రచారంలో టీచర్లు స్వయంగా తల్లిదండ్రులను కలుసుకుని..ప్రభుత్వ స్కూల్స్ సదుపాయాలు వివరించి నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. కొందరు ఉపాధ్యాయులు ఐతే గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ చొరవే ప్రభుత్వ పాఠశాలలకు కొత్త కళను తీసుకొచ్చింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ స్కూల్‌లలో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతే.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారమే తగ్గుతుందని చెప్పవచ్చు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *