వామ్మో.! గడ్డకట్టించే చలి.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు..

తెలుగు రాష్ట్రాలనూ మంచు ముంచేస్తోంది. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. అటు దట్టమైన మంచుతో వాహనాలు, విమానాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగ మంచు కురుస్తోంది. పొగమంచుతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లే విమానాలు ఆలస్యం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఇక మంచు ఎక్కువగా ఉండటంతో విమానాల రాకపోకలకు సైతం ఆటంకం కలుగుతోంది. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.

అటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఉత్తర, ఈశాన్య భారతం మీదుగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలికి తోడు గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో చలిపంజా విసురుతోంది. దీంతో నగర వాసులు బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు.. ఉదయం 9 దాటినా చలి తీవ్రత కొనసాగుతోంది.

About Kadam

Check Also

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *