పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్

భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు బాగా పెరిగాయి. ముఖ్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యూపీఐ చెల్లింపులు బాగా పెరిగాయి. యూపీఐ అనేది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు పద్ధతుల్లో ఒకటిగా మారింది. యూపీఐ ద్వారా కొనుగోలుదారుల బ్యాంకు ఖాతాల నుంచి వ్యాపారులు, వ్యక్తులకు రియల్‌టైమ్ చెల్లింపులను అనుమతిస్తుంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యూపీఐ చెల్లింపుల సాధారణ పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ.1,00,000గా నిర్ణయించింది . అయితే అన్ని బ్యాంకులు వినియోగదారులను ఈ స్థాయి వరకు లావాదేవీలు నిర్వహించడానికి అనుమతించవు. యూపీఐ నెట్‌వర్క్‌లోని వివిధ బ్యాంకులు రోజువారీ, వార, నెలవారీ చెల్లింపుల కోసం వారి సొంత లావాదేవీ పరిమితులను కలిగి ఉన్నాయి. నూతన వినియోగదారుల కోసం, మొదటి 24 గంటల వరకు రోజువారీ లావాదేవీ పరిమితి రూ.5,000గా ఉంది. వివిధ బ్యాంకుల ద్వారా రోజువారీ యూపీఐ చెల్లింపు పరిమితుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రోజువారీ యూపీఐ చెల్లింపు పరిమితులు ఇలా

ఆంధ్రా బ్యాంక్ పరిమితిని రోజుకు రూ.1,00,000, అలహాబాద్ బ్యాంక్ రూ.1,00,000, అలహాబాద్ యూపీ గ్రామీణ బ్యాంక్ రూ.40,000, ఐసీఐసీఐ రూ.1,00,000, పీఎన్‌బీ రూ.1,00,000, హెచ్‌డీఎఫ్‌సీ రూ.1,00,000, యాక్సిస్ బ్యాంక్ రూ.1,00,000, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,00,000గా ఉంది.

యూపీఐ లావాదేవాలు రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలు, మౌలిక సదుపాయాలు, కస్టమర్ బేస్ ఆధారంగా పరిమితులు బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు మోసాలు లేదా సాంకేతిక సమస్యలను తగ్గించడానికి తక్కువ పరిమితులను ఏర్పాటు చేసుకుంటాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆసుపత్రులు, విద్యా సంస్థల వంటి నిర్దిష్ట చెల్లింపుల కోసం ప్రతి లావాదేవీకి రూ.5 లక్షల పరిమితిని పెంచింది. బ్యాంకులు కలిగి ఉన్న ఖాతా రకం లేదా లావాదేవీ చరిత్ర ఆధారంగా వివిధ పరిమితులను విధించవచ్చు. ప్రీమియం ఖాతాదారులు లేదా బ్యాంక్‌తో దీర్ఘకాలిక సంబంధం ఉన్నవారు సాధారణ లేదా కొత్త కస్టమర్‌లతో పోలిస్తే అధిక పరిమితులను కలిగి ఉండవచ్చు.అలాగే యూపీఐ సిస్టమ్ సాంకేతిక సామర్థ్యాలు, కార్యాచరణ బ్యాండ్‌విడ్త్ కూడా లావాదేవీ పరిమితులను నిర్దేశించవచ్చు.

About Kadam

Check Also

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు!

Budget-2025: మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2025 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *