అప్పటి వరకు పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వదలం..! పార్లమెంట్‌ సాక్షిగా..

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. నెహ్రూ ప్రభుత్వం చేసిన తప్పులను మోదీ ప్రభుత్వం సరిదిద్దుతుందని, రక్తం, నీరు కలిసి ప్రవహించవని ఆయన పేర్కొన్నారు.

రక్తం, నీరు కలిసి ప్రవహించవని, ఉగ్రవాదానికి పాకిస్థాన​్‌ తన మద్దతు నిలిపివేసేంత వరకు సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తామని బుధవారం రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు. సింధూ జల ఒప్పందం అనేక విధాలుగా చాలా ప్రత్యేకమైన ఒప్పందం. ఒక దేశం తన ప్రధాన నదులను ఆ నదిపై హక్కులు లేకుండా మరొక దేశానికి ప్రవహించడానికి అనుమతించిన ఒప్పందం ప్రపంచంలో ఏదీ లేదు. కాబట్టి ఇది ఒక అసాధారణ ఒప్పందం, మనం దానిని నిలిపివేసినప్పుడు, ఈ సంఘటన చరిత్రను గుర్తుచేసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది ఆ చరిత్రతో అసౌకర్యంగా ఉన్నారు, బహుషా వారు చారిత్రక విషయాలను మర్చిపోయినట్లు ఉన్నారంటూ పరోక్షంగా ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు.

ఈ ఒప్పందం గురించి 1960లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు చేసిన ప్రకటనపై కూడా జైశంకర్ విమర్శలు చేశారు. “1960 నవంబర్ 30న ఈ సభ నీటి సరఫరా లేదా ఇవ్వాల్సిన డబ్బు పరిమాణాన్ని నిర్ణయించాలా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆయన (జవహర్‌లాల్ నెహ్రూ) అన్నారు. ప్రజలు దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కూడా ‘పాకిస్తాన్ పంజాబ్ ప్రయోజనాల కోసం ఈ ఒప్పందాన్ని చేయనివ్వండి అని అన్నట్లు గుర్తుచేశారు. అయితే నెహ్రు కాశ్మీర్, పంజాబ్ రైతుల గురించి, రాజస్థాన్ లేదా గుజరాత్ గురించి ఒక్క మాట మాట్లాడలేదని అని జైశంకర్ విమర్శించారు. సింధు జల ఒప్పందం, ఆర్టికల్ 370 విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ చేసిన తప్పులను ప్రధాని మోదీ సరిదిద్దారని ఆయన అన్నారు.

పండిట్ నెహ్రూ చేసిన తప్పును సరిదిద్దలేం, నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని సరిదిద్దవచ్చని చూపించింది. ఆర్టికల్ 370 సరిదిద్దాం, IWT సరిదిద్దాం, పాకిస్తాన్ ఉగ్రవాదానికి తన మద్దతును నిలిపివేసినంత వరకు సింధు జల ఒప్పందం నిలిపివేస్తామంటూ కుంట బద్దలు కొట్టారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవని మేం హెచ్చరించాం అంటూ పాకిస్థాన్‌కు మరోసారి గట్టి మేసేజ్‌ ఇచ్చారు.

About Kadam

Check Also

ఇంజనీరింగ్ పూర్తైన వారికి గుడ్‌న్యూస్.. త్వరలో 20,000 కొత్త నియామకాలు చేపట్టనున్న ఇన్ఫోసిస్!

ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రముఖ టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాదిలో సుమారు 20,000 మంది కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *