బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత్ పునరాగమనం చేసింది. గబ్బా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చివరి రోజైన బుధవారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 89 పరుగులకు డిక్టెర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యం 274 పరుగులకు చేరింది. దీంతో టీమిండియాకు 275 పరుగుల టార్గెట్ విధించింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారత్‌కు 275 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది. కెప్టెన్ పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లేర్ చేశాడు. కంగారూలు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. గబ్బా స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చివరి రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్ 22 పరుగులు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ తలో 2 వికెట్లు తీశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-1తో సమమైంది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.