భారత్‌ టెకీలపై అమెరికన్ల ఏడుపు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు! ఇంతకీ సంగతేమంటే..

భారత టెకీలు యూఎస్‌ కార్పొరేషన్లలో పనిచేయడం కొత్తేమీ కాదు. 1990ల నుంచి US కార్పొరేట్ సంస్కృతిలో మన టెకీలు పాతుకుపోతున్నారు. అయితే ప్రస్తుతం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొత్త చర్చ సాగుతోంది. అందులో USలో అధిక జీతం పొందే జాబ్స్‌లో ఎక్కువ భాగం ఇప్పుడు విదేశీ లేబర్‌కే దక్కుతున్నాయట. దీంతో యూఎస్ నియామక నిర్వాహకులు స్థానికులకు తక్కువ అవకాశాలు కల్పిస్తూ..

కోవిడ్‌ మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని తలకిందులు చేసింది. దీని ప్రభావం ఆర్ధిక, ఆరోగ్య, వాణిజ్యాలపైనే కాదు పలు ఉద్యోగాలను కూడా దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు ఇదే కోవిడ్‌ ఇండియన్‌ టెకీలకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టింది. నిజానికి.. భారత టెకీలు యూఎస్‌ కార్పొరేషన్లలో పనిచేయడం కొత్తేమీ కాదు. 1990ల నుంచి US కార్పొరేట్ సంస్కృతిలో మన టెకీలు పాతుకుపోతున్నారు. అయితే ప్రస్తుతం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొత్త చర్చ సాగుతోంది. అందులో USలో అధిక జీతం పొందే జాబ్స్‌లో ఎక్కువ భాగం ఇప్పుడు విదేశీ లేబర్‌కే దక్కుతున్నాయట. దీంతో యూఎస్ నియామక నిర్వాహకులు స్థానికులకు తక్కువ అవకాశాలు కల్పిస్తూ.. అధిక భాగం విదేశీ కార్మికులను మాత్రమే నియమించుకుంటున్నారని అమెరికన్ నెటిజన్లు వాదిస్తున్నారు. బంధుప్రీతి ప్రతిదీ శాసిస్తోందని అంటున్నారు. వీరి వాదనను ధృవీకరిస్తూ.. US బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో కోవిడ్‌ మహమ్మారి తర్వాత విదేశీ కార్మికుల ఉపాధి స్థాయిలు స్థానికంగా జన్మించిన వారి కంటే చాలా మెరుగ్గా మెరుగుపడ్డట్లు వెల్లడించింది. COVID -19 మహమ్మారి కారణంగా స్థానికులకు మార్చి-ఏప్రిల్ ఉపాధి స్థాయిలలో బాగా తగ్గుదల కనిపించిందని, కానీ విదేశీ కార్మికుల విషయంలో మాత్రం ఇది రివర్స్‌లో ఉన్నట్లు తెలిపింది.

మహమ్మారి తర్వాత విదేశాల్లో జన్మించిన వారి ఉపాధి వేగంగా బలం పుంజుకుంది. 2021 మధ్య నాటికి మహమ్మారికి ముందున్న పరిస్థితి పూర్తిగా మారి.. అది 2024 వరకు క్రమంగా పెరుగుతూనే ఉంది. 2025లో కొద్దిగా తగ్గినా గరిష్ట స్థాయి (100 శాతంకి పైగా)కి చేరుకుంది. స్థానికుల విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉపాధి నెమ్మదించి.. దాదాపు బేస్‌లైన్‌కు దగ్గరగా పడిపోయింది. ఇటీవల ఒరాకిల్‌తో సహా కొన్ని టెక్ కంపెనీల వేతన ఉల్లంఘనలు, నియామక పక్షపాతంపై US కార్మిక శాఖ కేసు పెట్టడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఏషియన్ దరఖాస్తుదారులకు ముఖ్యంగా ఇండియన్స్‌కు అనుకూలంగా అర్హత కలిగిన శ్వేతజాతి, హిస్పానిక్, ఆఫ్రికన్-అమెరికన్ దరఖాస్తుదారులపై నియామక వివక్షను చూపుతున్నట్లు యూఎస్ కార్మిక శాఖ ఆరోపించింది. అయితే ఒరాకిల్ ఈ వాదనను ఖండించింది. వైవిధ్యం, చేరికకు తాము విలువ ఆస్తామని, బాధ్యతాయుతమైన సమాన అవకాశాలు తామెప్పుడూ కల్పిస్తామని ఒరాకిల్ ప్రతినిధి డెబోరా హెల్లింగర్ అన్నారు. మా నియామకం, వేతన నిర్ణయాలు వివక్షత లేనివి. అనుభవం, యోగ్యతతో సహా చట్టబద్ధమైన వ్యాపార అంశాల ఆధారంగా మాత్రమే నియమాకాలు ఉంటాయని స్పష్టం చేసింది.

H-1B వీసాలకు ప్రభుత్వం ఆమోదించే ప్రక్రియను నెటిజన్లు సైతం విమర్శిస్తున్నారు. ఉపాధికి దీనిని అడ్డంకిగా చూస్తున్నారు. నిజానికి, H-1B వీసా అనేది 1990లలో సృష్టించబడింది. ఆ సమయంలో US టెక్నాలజీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వ్యక్తిగత కంప్యూటర్లు, ఇంటర్నెట్ స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ పెరుగుదల ఫలితంగా మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, తరువాత Google, Amazon వంటి కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఈ కంపెనీలకు దేశీయంగా ప్రత్యేక సాంకేతిక సిబ్బంది లభ్యం కాలేదు. ఈ అంతరాన్ని పూడ్చడానికి అమెరికా 1990లో ఇమ్మిగ్రేషన్ చట్టంలో భాగంగా H-1B వీసాలను తీసుకువచ్చింది. స్పెషలైజ్‌డ్‌ నాలెడ్జ్ అవసరమయ్యే విభాగాలకు.. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (STEM)లో.. ఆయా సంస్థలకు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి అమెరికా అనుమతి ఇచ్చింది.

About Kadam

Check Also

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ మార్గాల్లో 54 ప్రత్యేక రైళ్ల సేవలు పొడగింపు!

రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశంలోని పలు మార్గాల్లో సేవలందిస్తున్నా సుమారు 54 ప్రత్యేక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *