దుర్గమ్మ భక్తులకు అలర్ట్‌.. ఇకపై అవి పాటించకపోతే ఆలయంలోకి నో ఎంట్రీ!

దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి వస్తున్నారా అయితే ఇకపై కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే. ఆలయానికి వచ్చే స్త్రీలైనా, పురుషులైన ఈ నిబంధనలు పాటించకుండా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే వారికి ఎంట్రీ ఉండదని.. వచ్చిన దారిలోనే వారు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇంతకు ఏంటీ కొత్త నిబంధనలు తెలుసుకుందాం పదండి.

ఇంద్రకీలాద్రి తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ మధ్యకాలంలో చాలామంది ఆలయానికి వచ్చేటప్పుడు, ఆలయంలో ఉన్నప్పుడూ ఎలా ఉండాలి, ఎలా రావాలి అనేది పూర్తిగా మరిచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది అయితే పూర్తిగా అభ్యంతరకర దుస్తుల్లో స్లీవ్ లెస్ లు, మినీ స్కాట్స్, షాట్స్ లో ఏదో సరదాగా పార్క్‌కి వచ్చినట్లు ఆలయానికి వస్తున్నారు. అంతే కాకుండా ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్స్ తీసుకుని వచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. తెలిసి తెలియక అక్కడ సెల్ఫీలు దిగడం అమ్మవారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం లాంటి చేస్తున్నారు. ఒక పక్క డ్రెస్ కోడ్ పాటించక పోవడం, మరోపక్క అమ్మవారి మూలవిరాట్ ముఖ్యంగా దసరా లాంటి సమయాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అవుతున్నాయి. సెల్ ఫోన్స్ ఉన్న వ్యక్తులు ఆలయంలో దొంగచాటుగా అమ్మవారి స్వరూపం చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టకూడదని నిబంధన ఉంది. కాబట్టి సంప్రదాయ పరిరక్షణ, ఆలయ ప్రతిష్ట, ఆలయ భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలని ఆలయ అధికారులు చెబుతున్నారు.

అయితే ఇక్కడ కచ్చితంగా ఇదే డ్రెస్‌కోడ్‌ పాటించాలని ఏమి లేదు. కానీ అభ్యంతరమైన దుస్తులు ధరించి రావొద్దని.. సాంప్రదాయమైన దుస్తువులు ధరించాలని అధికారులు చెబుతున్నారు. ఇది ఆలయ ఆలయ ప్రతిష్టకు సంబందించినదిని కాబట్టి వివిఐపీల, వీఐపీలు సహా ఆయానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ రూల్‌ వర్తిస్తుందన్నారు. ఆలయంలో పనిచేసే సిబ్బందికి సైతం అంతరాలయంలోకి ఫోన్లు తీసుకురాకూడదని తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో కచ్చితంగా దీన్ని అమలు చేసేలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన సైన్ బోర్డ్ సైతం ఇంద్రకీలాద్రి పై అన్ని వైపులా ఏర్పాటు చేశారు. తెలియని వారికి తెలిసేలా తెలియకుండా పొరపాటున వచ్చిన వారికి అందుబాటులో దేవాలయ కౌంటర్ లోనే అమ్మకానికి వస్త్రాలు పెడుతూ, ఫోన్స్ తో వచ్చిన వాళ్ళను తనిఖీలు చేస్తూ వెనక్కి పంపిస్తూ ముందుగానే భక్తులకు తెలిసేలా అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. దీన్ని భక్తుల సైతం స్వాగతిస్తున్నారు.

తిరుమల తిరుపతి తరహాలో ఇంద్రకీలాద్రిలో సైతం కీలకమైన మార్పులు జరగాలని ప్రతి ఒక్కరు ఈ నిబంధనలు పాటిస్తే ఇంద్రకీలాద్రికి మరింత ప్రాముఖ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. తిరుమల తరహాలో ఇంద్రకీలాద్రి నీ అభివృద్ధి చేయాలంటే ముందు గ్రౌండ్ స్థాయి నుంచి మార్కులు తప్పనిసరి అంటున్నారు.. దానికోసం ఇలాంటి కఠిన ఆంక్షలు తప్పనిసరి అని చెప్తున్నారు.

About Kadam

Check Also

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *