ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. డిగ్రీ పాసైతే చాలు!

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (Intelligence Bureau) మరో భారీ శుభవార్త చెప్పింది. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు అసిస్టెంట్‌ సెంట్రల్ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ACIO) గ్రేడ్‌-2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా ఇందుకు సంబంధించి షార్ట్‌ నోటీస్‌ జారీ చేశారు. విద్యార్హత, వయోపరిమితి, జీతం, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్‌ను జులై 19వ తేదీ ఐబీ (IB) అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది..

భాతర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకి చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (Intelligence Bureau) మరో భారీ శుభవార్త చెప్పింది. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు అసిస్టెంట్‌ సెంట్రల్ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ACIO) గ్రేడ్‌-2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి షార్ట్‌ నోటీస్‌ తాజాగా విడుదలైంది. సంబంధించిన విద్యార్హత, వయోపరిమితి, జీతం, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్‌ను జులై 19వ తేదీ ఐబీ (IB) అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు..

  • జనరల్ (UR) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 1,537
  • ఓబీసీ (OBC) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 946
  • ఎస్సీ (SC) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 566
  • ఎస్టీ (ST) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 226
  • ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 442

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. అలాగే కంప్యూటర్ స్కిల్స్‌ కూడా ఉండాలి. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు జులై 19, 2025వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగనుంది. టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), టైర్-2 (డెస్క్రిప్టివ్ టైప్), ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ మూడు దశల్లో ప్రతిభకనబరచిన వారికి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు. అలాగే ఇతర అలవెన్సులు, సదుపాయాలు కూడా కల్పిస్తారు. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

About Kadam

Check Also

దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్‌ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..

ఇక్కడ 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *