రెండు గిన్నిస్‌ రికార్డులు.. చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర-2025.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

యోగా పండగ కోసం తీర సాగరం ముస్తామైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా లక్షల మంది హాజరు కానుండటంతో ఆకట్టుకునేలా కడలి తీరాన్ని తీర్చిదిద్దుతున్నారు. నగర థీమ్, సెల్ఫీ పాయింట్లతోపాటు సముద్ర జీవుల ప్రాధాన్యం వివరించే బొమ్మలతో కూడళ్లను చూపుతిప్పుకోనివ్వకుండా మారుస్తున్నారు. ఈ యోగా డే ఏర్పాట్లు, నిర్వాహణపై చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర-2025కు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రపంచ రికార్డు సృష్టించేలా సాగరతీరంలో లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు రంగం సిద్ధమవుతోంది. ‘యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్’ నినాదంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. యోగాంధ్రతో రెండు గిన్నిస్‌ రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో 26 కిలోమీటర్లు పరిధిలో 3 లక్షల 19 వేల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. యోగా మన జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ శిక్షణ, కోర్సులు నిర్వహించినున్నట్లు తెలిపారు.

యోగా వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ యోగా మ్యాట్, టీషర్టు

యోగా వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఒక మ్యాట్, టీషర్టులు ఇవ్వనున్నారు. ఇక యోగాడే నేపథ్యంలో విశాఖలో అణువణువు నిఘా పెట్టారు పోలీసులు. కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ప్రధాన వేదిక ఆర్కే బీచ్ రోడ్‌లో అదనపు భద్రత ఏర్పాటు చేశారు. 2వేలకు పైగా సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలతో నిఘా పెట్టారు. కీలక రూట్లలో ఐదు కిలోమీటర్ల రేడియేషన్‌లో నో ఫ్లయింగ్ జోన్.. రెడ్ జోన్‌గా డిక్లేర్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పన్నెండు వేల మంది సిబ్బంది సేవలు వినియోగించుకోనున్నారు.

SPG నిఘా నీడలో..

ప్రధాని మోదీ యోగాసనాలు వేసే వేదికను SPG తమ ఆధినంలోకి తీసుకుంది. వేదిక మొత్తం నిఘా నీడలో ఉండే ఏర్పాటుల చేశారు. ఎక్కడైనా చిన్న అనుమానం ఉన్న.. ట్రాఫిక్ జామ్ అయినా.. కమాన్ కంట్రోల్ నుంచి ఉన్నతాధికారులకు క్షణాల్లో సమాచారం అందెలా ఏర్పాట్లు చేసుకున్నారు.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *