దేశంలో మారో రాకెట్‌ లాంచ్‌ సెంటర్‌ ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

ఇస్రో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య గణనీయంగా పెంచుతోంది. గతంలో ఏడాదికి ఒకటి రెండు ప్రయోగాలు మాత్రమే చేసే ఇస్రో ఇప్పుడు నెలకో లాంచ్ చేస్తోంది. ఈ సంఖ్యను మరింత పెంచేందకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటిదాకా రాకెట్ ప్రయోగం అంటే కేవలం శ్రీహరికోట నుంచి మాత్రమే చేపట్టేది. కానీ ఇప్పుడు రాకెట్‌ లాంచ్‌ కోసం సెంటర్‌ను ఇప్రో ఏర్పాటు చేస్తోంది. దీనికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే భారత్‌కు రెండో రాకెట్‌ లాంచ్‌ సెంటర్‌ కూడా అందుబాటులోకి వస్తుంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగాల కోసం ఉన్న ఏకైక రాకెట్ ప్రయోగ కేంద్రం తిరుపతి జిల్లాలోని సతీష్ దావాన్ స్పేస్ సెంటర్ షార్ ( శ్రీహరికోట). అయితే షార్ నుండి ఇస్రో ఇప్పటికే ఎన్నో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టి విజయాలను కైవసం చేసుకుంది. గతంలో స్వదేశీ అవసరాల కోసం మాత్రమే ప్రయోగాలను చేపట్టిన ఇస్రో.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను ప్రవేశపెడితే, కమర్షియల్‌గా ఇతర దేశాలతో పోలిస్తే ముందంజలో ఉంది. అలాంటి తరుణంలో భవిష్యత్తులో ప్రయోగాల సంఖ్య మరింత పెంచేందుకు.. మరో రాకెట్‌ లాంట్‌ సెంటర్ అవసరమని ఇప్రో భావిస్తోంది. ఇదే విషయాన్ని ఇస్రో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీని పట్ల ప్రధాని నరేంద్ర మోడీ కూడా దృష్టి సారించి. రెండవ రాకెట్ ప్రయోగ కేంద్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

దీనికి కేంద్ర క్యాబినేట్‌లో ఆమోదం తెలిపి. రాకెట్‌ సెంటర్ నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు. అందులో భాగంగానే తమిళనాడు లోని తూత్తుకూడి జిల్లా కులశేఖర పట్నం వద్ద సముద్రం తీరాన ఆనుకొని ఉన్న పలు గ్రామాలకు సంబంధించిన స్థలాన్ని సేకరించారు. ప్రయోగకేంద్రం కోసం సుమారు 2,233 ఎకరాలకు పైగా భూమి కేటాయింపులు జరిగాయి. కులశేఖర పట్నం కూడా రెండవ రాకెట్ లాంచింగ్ కేంద్రంగా ఉంటే చిన్న చిన్న రాకెట్ ప్రయోగాలను చేపట్టేందుకు అనువుగా ఉంటుందని ఇస్రో శ్రీకారం చుట్టింది. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి ప్రయోగాల కోసం రెండో లాంచ్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతుండగా.. మరో ఏడాదిలో కులశేఖర పట్నం నుంచి తొలి ప్రయోగం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక్కడే ఎందుకు..

భూమిపై నుంచి రాకెట్ వేయడం జరగాలంటే భూ ఆకర్షణ శక్తి తక్కువగా ఉన్న ప్రాంతం నుంచి జరపాల్సి ఉంటుంది. భారతదేశంలో శ్రీహరికోట అలాంటి అనువైన ప్రాంతం కావడంతో ఇక్కడ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా తమిళనాడులోని కులశేఖర పట్నం కూడా ఇలాంటి అనువైన ప్రాంతంగా గుర్తించారు. అందుకే కులశేఖర పట్నం భూ మధ్య రేఖకు అతి దగ్గరగా ఉన్న ప్రదేశం కూడా కావడంతో దీనిపై ఇస్రో ఎక్కువ దృష్టి చేపట్టి పనులు ను కూడా యుద్ద ప్రాధిపదికన పూర్తి చేస్తోంది.

2024 ఫిబ్రవరి 28వ తేదీన తమిళనాడులోని తూతుకూడి జిల్లా కులశేఖర్ పట్నంలో ఇస్రో రెండవ స్పేస్ పోర్టును సిద్ధం చేసి.. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించింది. భవిష్యత్తులో శ్రీహరికోట నుండి భారీ నుండి అతి భారీ రాకెట్ ప్రయోగాలు చేయనున్న ఇస్రో.. షార్ రాకెట్ కేంద్రం భవిష్యత్‌లో బిజీ గా ఉండబోతోందని తెలిపింది. అందుచేత చిన్న ప్రయోగాలు వాణిజ్య పరమైన ప్రయోగాలు, ఎస్ఎస్ఎల్వీ లాంటి చిన్నతరహార రాకెట్లు, ప్రైవేటు సంస్థలకు చెందిన రాకెట్లను కులశేఖర పట్నం రాకెట్ సెంటర్‌ నుండి ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది.

అయితే ఐదారేళ్ళ క్రితమే తూర్పు తీర ప్రాంతంలో ఇస్రో రెండో స్పేస్ పోర్ట్ నిర్మించాలని ఉద్దేశంతో స్థల అన్వేషణ చేశారు. అదే సమయంలో కృష్ణాజిల్లా నాగయ్ లంకను కూడా పరిశీలించడం జరిగింది. అయితే అక్కడ రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తమిళనాడు రాష్ట్రంలోని తూతుకూడి జిల్లాలోని కులశేఖర్ పట్నంను ఎంచుకుంది.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *