వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..

తానొక్కడనే పరుగెత్తడం కాదు.. ఇకపై మిమ్మల్నీ పరుగెత్తిస్తా.. బీ క్లియర్‌.. ఇవీ.. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కామెంట్స్‌.. ఎస్‌.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి వేదికగా జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ముగిసింది. పలు కీలక అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. చివరి రోజు సమావేశంలో ఏపీ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సు గతానికి భిన్నంగా జరిగింది. సుదీర్ఘ ప్రజంటేషన్లు, పేజీలకు పేజీల పీపీటీలకు చంద్రబాబు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. కేవలం 9 నెలలుగా ఆయా శాఖల్లో తీసుకున్న చర్యలు, ముందున్న సవాళ్లు, చేరుకోవాల్సిన లక్ష్యాలపైనే ఫోకస్‌ చేశారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, సమస్యల పరిష్కారంపై కలెక్టర్ల సదస్సులో లోతైన చర్చ జరిగింది. తొలి రోజు కలెక్టర్ల నుంచి వివిధ అంశాలపై క్షేత్రస్థాయి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న సీఎం చంద్రబాబు.. రెండో రోజు పూర్తిగా కలెక్టర్ల ప్రజంటేషన్‌కే సమయం ఇచ్చారు. దాంతో.. 26 జిల్లాల్లోని పరిస్థితులు, సమస్యలు, నిర్ణయాలు, ఫలితాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తానని స్పష్టం చేశారు. దానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక.. ఏపీ ఆర్థిక పరిస్థితులపైనా ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు సీఎం చంద్రబాబు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా పోరాటం చేస్తున్నామని తెలిపారు. సూపర్‌-6 కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.

కూనంనేని వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన

అయితే.. తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు కూనంనేని సాంబశివరావు. పద్దులపై చర్చ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు సీపీఐ ఎమ్మెల్యే… చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు.. ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారని.. ఏ ఇజం లేదంటే అప్పుడు తమకు కోపం వచ్చేది.. కానీ, నిజంగా ఖర్చులేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అంటూ కూనంనేని పేర్కొన్నారు. చంద్రబాబు నాడు చెప్పిన మాటే నిజమంటూ అభిప్రాయపడ్డారు..

ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు నవ్వుతూ స్పందించారు.. తాను ఏ ఇజం లేదంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారని.. ఖర్చు లేని ఇజం టూరిజమేనని స్టేట్‌మెంట్‌ ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. తన మాటలు, ఆలోచలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

కలెక్టర్ల ప్రజంటేషన్‌లో భాగంగా.. జిల్లాల్లో ఏం జరుగుతోంది?.. అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయి?.. అనే అంశాలను ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలోనే.. తలసారి ఆదాయం ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు కేటాయించడంతోపాటు.. సర్వీస్‌ డెలివరీకి సంబంధించిన ర్యాంకులను కూడా సీఎం చంద్రబాబు వెల్లడించారు.

మొత్తంగా.. రెండు రోజుల సదస్సులో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. అదేసమయంలో కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని.. ఆయా జిల్లాల్లోని అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

About Kadam

Check Also

కలియుగంలో అపర కుభేరుడు ఆయనే.. అంతకంతకూ పెరుగుతున్న వెంకన్న ఆదాయం

కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం.  అయితే ఇటు హుండీ, అటు డిపాజిట్లపై వచ్చే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *