సృష్టికర్తలు కాదు.. పచ్చి దగాకోర్లు.. ఏం చేశారో తెలిస్తే తూ అని ఊస్తారు..

పిల్లల్ని మార్చి.. నమ్మిన దంపతుల్ని ఏమార్చి, చైల్డ్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డ సృష్టికర్తలు ఎట్టకేలకు నేరం ఒప్పుకున్నారు. ఔను.. సరొగసీ పేరుతో పచ్చిమోసానికి పాల్పడ్డాం, దగా చేశాం, డాక్టర్ల వేషంలో దందాలు చేశాం అని లెంపలేసుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ అక్రమాల కేసు దర్యాప్తులో ఇదొక కీలక పరిణామం.

సంతాన సాఫల్యం ముసుగులో అడ్డగోలు సంపాదనకు తెగించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కథ క్లయిమాక్స్‌కు చేరినట్టే ఉంది. గత వారంలో అరెస్టయిన డాక్టర్ నమ్రత కస్టడీ నిన్నటితో ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే… నాలుగురోజుల కస్టడీలో సృష్టి గ్యాంగ్‌నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు పోలీసులు..

డాక్టర్‌ నమ్రత, విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్‌ కళ్యాణి, ఏజెంట్‌గా వ్యవహరించిన మరో నిందితురాలు సంతోషి ముగ్గురినీ నార్త్‌జోన్‌ కార్యాలయంలో ఒకేచోట ఉంచి ప్రశ్నించారు. మొదట్లో అంత ఈజీగా నోరు మెదపలేదు. కీలక నిందితురాలు డాక్టర్‌ నమ్రతకు గతంలో జైలుకు వెళ్లి వచ్చిన అనుభవం ఉంది గనుక.. పోలీసుల దగ్గర తెలివితేటలు ప్రదర్శించినట్టు తెలుస్తోంది. కానీ.. పోలీసులు తాము సేకరించిన ఆధారాల్ని చూపించి, తమదైన స్టయిల్‌లో ఇంటరాగేట్ చేయడంతో చేసిందంతా కక్కేశారు నిందితులు..

దాదాపు 80 ఫేక్ సరోగసీ కేసులు చేసినట్టు.. ఒక్కొక్కరి దగ్గర 20 నుంచి 30 లక్షలు దండుకున్నట్టు ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. ఈ దందాలో తమకు సహకరించిన అనస్థీషియా డాక్టర్ సదానందమ్‌కు భారీ నజరానా ఇచ్చినట్టు, సబ్ ఏజెంట్లకు కమీషన్ ఇచ్చినట్టు కూడా కస్టడీలో అంగీకరించారామె. అసోమ్, బిహార్, ముంబై, రాజస్థాన్ నుంచి పసికందుల్ని కొనుగోలు చేసి చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారట. ఇంతా చేసి.. విశాఖలో నమోదైన కేసులో హైదరాబాద్‌లో ఏంటి హడావిడి అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు డాక్టర్ నమ్రత.

సంతానలేమితో బాధపడుతూ IVF కోసం వచ్చినవారిని మాయమాటలతో సరోగసీకి ఒప్పించి లక్షల్లో డబ్బు దండుకోవడం సృష్టి మేజిక్‌లో ఫస్ట్ స్టెప్. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంపులు పెట్టి, ఏజెంట్ల సహకారంతో పేద మహిళల్ని ఉచ్చులోకి దింపడం సెకండ్ స్టెప్. విశాఖ, విజయవాడకు తరలించి వారికి పుట్టిన చిన్నారులను సరోగసీ పేరుతో వేరే దంపతులకు కట్టబెట్టడం.. ఇది మూడో స్టెప్. మీరిచ్చిన బిడ్డ తమ బిడ్డ కాదని ఎవరైనా ఎదురు తిరిగితే బెదిరించి భయపెట్టడం ఏజెంట్ కళ్యాణి డ్యూటీ అట.

అటు.. సృష్టి మాయతో దగాపడ్డ మిగతా దంపతులు కూడా క్యూ కడుతున్నారు. ట్రీట్‌మెంట్ హిస్టరీ, రిపోర్టులు, నగదు బదిలీ వివరాలతో కంప్లయింట్స్ ఇస్తున్నారు. సాక్షుల సంఖ్య పెరగడంతో, కొత్తగా లభించిన ఆధారాల ద్వారా దర్యాప్తు మరింత లోతుగా జరిగి సృష్టి డొంక ఇంకా కదిలే అవకాశముంది. ఇప్పటిదాకా సృష్టి కేసుకు సంబంధించి 12 మంది అరెస్టయ్యారు. 6 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సూత్రధారి, ప్రధాన పాత్రధారి డా. నమ్రత చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. కస్టడీలో ఉన్న మిగతా నిందితులు కళ్యాణి, ధనశ్రీ సంతోషి విచారణ ఇవాళ్టితో ముగుస్తుంది. మొత్తానికి అమూల్యమైన మాతృత్వంతో చెలగాటం ఆడిన సృష్టికర్తలకు సినిమా కనిపిస్తోందిప్పుడు.

About Kadam

Check Also

తేజ్‌ నేను ఎవరితో మాట్లాడలేదురా.. నా కొడుకును మంచిగా చూసుకో.. ఇల్లాలు బలవన్మరణం

కేశవపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తాడికల్‌కు చెందిన 27ఏళ్ల గొట్టె శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *