పూరీ జగన్నాథ్ ఆలయ రహస్యం.. నేలపై నీడ పడని వైనం, దైవ ఘటనా, ఆలయ నిర్మాణ శైలా..

ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథుని ఆలయం హిందూ మతంలోని నాలుగు ధామాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. జగన్నాథుడు అంటే ప్రపంచానికి ప్రభువు అని అర్ధం. ఇక్కడ దేవుడి సజీవంగా ఉన్నాడని భక్తుల నమ్మకం. అంతేకాదు ఈ జగన్నాథ ఆలయంలో ఎవరూ కనుగొనలేని అనేక అపరిష్కృత రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలలో ఒకటి జగన్నాథ్ పూరి ఆలయం నీడ కనిపించకపోవడం. దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం

దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో జగన్నాథ పూరి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు తన అన్నయ్య బలభద్రుడు , సోదరి సుభద్రతో కలిసి ఉన్నాడు. వీరిని చూసేందుకు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. జగన్నాథ పూరి ఆలయం దాని పరిష్కారం కాని రహస్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రహస్యాలలో ఒకటి జగన్నాథ పూరి ఆలయం నీడ రోజులో ఏ సమయంలోనూ కనిపించకపోవడం. జగన్నాథ ఆలయానికి నీడ ఎందుకు ఉండదో ఈ రోజు తెలుసుకుందాం..

జగన్నాథ ఆలయ శిఖరం నీడ ఎవ్వరికీ కనిపించదు. ఇది ఆలయానికి సంబంధించిన విశేషాలలో ఒకటి. రోజులో ఏ సమయంలోనైనా ఆలయ నీడ నేలపై పడదు. ఈ రహస్యాన్ని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేకపోయారు. పూరీ జగన్నాథ ఆలయ నీడ ఎప్పుడూ కనిపించదని లేదా నీడ నేలపై పడదని ఒక మత విశ్వాసం ఉంది. ఈ ఆలయం నిర్మించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ ఆలయం నీడను ఎవరూ చూడలేదని చెబుతారు.

దైవిక అద్భుతం అని భక్తుల నమ్మకం. శాస్త్రీయ దృక్కోణంలో సూర్యకిరణాలు నేరుగా దానిపై పడే విధంగా.. ఆలయ శిఖర నీడ నేలను చేరని విధంగా ఆలయ నిర్మాణం నిర్మించబడిందని నమ్ముతారు. అయితే కొంతమంది దీనిని దైవిక శక్తి అని .. దైవం చేసిన ఒక అద్భుతం అని కూడా భావిస్తారు.

జగన్నాథ ఆలయం నీడ ఎందుకు కనిపించదు? పూరి జగన్నాథ ఆలయం దాని ప్రత్యేకమైన, అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. ఈ నిర్మాణ శైలి ప్రభావం లేదా అద్భుతం కారణంగా.. ఈ ఆలయం నీడ కనిపించదు. జగన్నాథ పూరి ఆలయ స్థలం, రూపకల్పన సూర్యునితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే విధంగా.. సూర్యకిరణాలు ఆలయాన్ని తాకి ఆలయంపైనే నీడను సృష్టించే విధంగా తయారు చేయబడింది.

పూరి జగన్నాథ నీడ పడుతుంది.. అయితే అది కనిపించదు. ఆలయ నిర్మాణంపైనే నీడ ఏర్పడటం వల్ల.. అది నేలను చేరదు. ఎవరికీ కనిపించదు. అందుకే ప్రజలు ఆలయానికి నీడ లేదని భావిస్తారు. ఇది వాస్తవానికి శాస్త్రానికి మించిన ప్రత్యేకమైన నిర్మాణం. అయితే ఆలయ నీడ ఏర్పడుతుంది.. కానీ ఎవరికీ కనిపించదు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. 

About Kadam

Check Also

తక్కువ ధరకే పాండురంగడు, మహా లక్ష్మి సహా ప్రముఖ క్షేత్రాల దర్శనం.. టీఎస్ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటన

శ్రీ మహా లక్ష్మి కొలువైన క్షేత్రం అష్టాదశ మహా శక్తి పీఠాలలో ఒకటి కొల్హాపూర్. పంచగంగ నదీ తీరాన ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *