సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు విద్యార్థులు తమ బ్యాగులను తలపై మోసుకుంటూ వదల్లోంచి బయటకు వెళ్తున్నారు. హాస్టళ్లు, తరగతి గది భవనాలు వంటి లోతట్టు ప్రాంతాలలోకి నీరు ప్రవేశించటంతో సాధారణ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యా భవనాలకు ప్రవేశం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు.
భారీ వర్షాల కారణంగా జమ్మూలోని జీజీఎం సైన్స్ కళాశాల ప్రాంగణం మునిగిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు కళాశాల నుంచి వరద నీటిలో బ్యాగ్‌లు పట్టుకొని బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా కశ్మీర్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
మంగళవారం కురిసిన కుండపోత వర్షాలు జమ్మూ అంతటా విధ్వంసం సృష్టించాయి. ప్రభుత్వ గాంధీ మెమోరియల్ (GGM) సైన్స్ కళాశాల, క్లస్టర్ విశ్వవిద్యాలయం ప్రాంగణం చిన్నపాటి చెరువును తలపించింది. భారీగా చేరిన వరద నీటితో విద్యా దినచర్యకు అంతరాయం కలిగించింది. విద్యార్థులు, సిబ్బంది మోకాళ్ల లోతు నీటిలో నడవాల్సి వచ్చింది.