ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో ఏమో.. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా రకరకాల వైరస్ లు వెలుగులోకి వస్తూ మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. తాజాగా జపనీస్ మెదడువాపు జ్వరం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ప్రకారం, ఢిల్లీలోని వెస్ట్ జోన్‌లోని బందీపూర్ ప్రాంతంలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఇది దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది.

1. తీవ్ర జ్వరం 2.తలనొప్పి 3.కండరాల నొప్పి 4. తలనొప్పితో కూడిన వాంతులు 5. మూర్ఛ
జపనీస్ ఎన్సెఫాలిటిస్ ఫీవర్ ను ఎలా గుర్తించాలంటే
జపనీస్ ఎన్సెఫాలిటిస్ ఫీవర్ ని నిర్ధారించడానికి సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (CSF) పరీక్ష ను చేయించుకోవాలి. రక్త పరీక్షలో JEVకి వ్యతిరేకంగా ప్రతిరోధకాలు ఉంటే ఈ వ్యాధి బారిన పడినట్లే..
ఈ జ్వరం మెదడుకు చేరితే చికిత్స చేయడం కష్టం. ఇది మరణానికి కూడా కారణం కావచ్చు. ఈ వైరస్ బారిన ఎక్కువగా పిల్లలు పడతారు. ఈ వ్యాధి అధిక కేసు మరణాల రేటు (CFR) కలిగి ఉంది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొంది జీవించి ఉన్నవారు కాలక్రమంలో రకరకాల వ్యాధుల బారిన పడతారు. వివిధ స్థాయిల నరాల సంబంధిత ఇబ్బందులను పడే అవకాశం ఉంది. ఈ వైరస్ మొదటసారి 1871 లో జపాన్‌లో వెలుగులోకి వచ్చింది.