రేపటి జేఎన్టీయూ హైదరాబాద్ అన్ని పరీక్షలు వాయిదా..! కారణం ఇదే..

జేఎన్టీయూ హైదారబాద్‌ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఫార్మా డి మొదటి ఏడాది పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ కె కృష్ణమోహన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 6న జరగాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించారు. ఆ రోజు గణేశ్‌ నిమజ్జనం ఉండటంతో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 6వ తేదీన జరగాల్సిన పరీక్షను సెప్టెంబరు 17వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు విద్యార్ధులు గమనించాలని, సూచనల ప్రకారం పరీక్షలకు సిద్ధమవ్వాలని తెలిపారు.

ఎస్‌ఎస్‌సీ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ప్రాథమిక కీ వచ్చేసింది.. సెప్టెంబర్‌ 7 వరకు అభ్యంతరాలకు ఛాన్స్‌!

ఎస్సెస్సీ కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎగ్జామినేషన్‌ 2025 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయి ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీతోపాటు రెస్పాన్స్‌షీట్‌, ప్రశ్నపత్రంని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను తెలిపేందుకు సెప్టెంబర్‌ 7 వరకు అవకాశం ఇచ్చింది. కాగా ఎస్‌ఎస్‌సీ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పేపర్‌ 1 పరీక్ష ఆగస్టు 12న జరిగిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. మరోవైపు సీజీఎల్‌ 437 గ్రూప్‌ ‘బి’ నాన్‌ గేజిటెడ్‌ పోస్టులకు కూడా స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలింసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్ష మరో వారంలోనే జరగనుంది.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *